
బోనకల్లు, జనవరి 9: సీఎం కేసీఆర్ రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారని రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మందడపు తిరుమలరావు, మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ అన్నారు. ఆదివారం మండలంలోని బ్రాహ్మణపల్లి సొసైటీ అధ్యక్షుడు ఏనుగు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు గంగసాని రాఘవరావు ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటం వద్ద వృద్ధ రైతులు వందనాలు చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతే రాజు నినాదంతో కేసీఆర్ ముందుకు సాగుతూ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. రాపల్లె గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, సర్పంచ్ జెర్రిపోతుల రవీందర్, ఎంపీటీసీ చేపూరి సునీత, గ్రామ కన్వీనర్ జంగం అర్లప్ప, సొసైటీ డైరెక్టర్లు వంగాల కృష్ణ, పెనుగొండ ఏడుకొండలు, సాధినేని కిశోర్‌బాబు, తోట కొండలు, సీఈవో చేపూరి నాగరాజు, ఏఈవో గోపి, రైతులు పాల్గొన్నారు.
చింతకాని, జనవరి 9: మండలంలో చింతకాని, నాగులవంచ గ్రామాల్లో పీఏసీఎస్, రైతుబంధు సమితి ఆధ్వర్యంలో ఆదివారం మహిళా రైతులు ముగ్గులు వేశారు. రైతుబంధుసమితి మండల కమిటీ సభ్యులు పెంట్యాల పుల్లయ్య , సొసైటీ చైర్మన్లు శేఖర్‌రెడ్డి, శేషగిరి, నాయకులు రమేశ్, మనోహర్, సత్యనారాయణ, ఏవో నాగయ్య, సీఈవో శ్రీనివాస్‌రావు, ఏఈవోలు పాల్గొన్నారు.
మధిరరూరల్, జనవరి 9: మండలంలోని ఖమ్మంపాడు సొసైటీలో డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలను నిర్వహించారు. సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మ, రైతుబంధు గ్రామ కన్వీనర్ కుర్రా అప్పారావు, ఏఈవో ప్రసన్న, రైతులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని తొండలగోపవరంలో సర్పంచ్ పింగలి శిరీష ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలను నిర్వహించారు. అనంతరం భూమిరత్న అవార్డు అందుకున్న ఉత్తమ రైతు కుడుముల వెంకటరామిరెడ్డిని సత్కరించారు.
ఎర్రుపాలెం, జనవరి 9: ఎర్రుపాలెం సొసైటీ ఆవరణలో రైతుబంధు సంబురాలను సొసైటీ చైర్మన్ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎంపీపీ దేవరకొండ శిరీష, చావా రామకృష్ణ, సర్పంచ్‌లు అప్పారావు, పురుషోత్తంరాజు, ఎంపీటీసీలు మస్తాన్‌వలీ, కిశోర్‌బాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాంబశివరావు, కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్ శిరోమణి, సభ్యులు రవి, నారాయణరావు, తక్కెళ్లపాటి వెంకటేశ్వర్లు, భాస్కర్, రవి, సుధీర్, బాజీ, రాము, తిరుపతిరావు, శ్రీనివాస్‌రావు, చిరంజీవి, నాగరాజు, హుస్సేన్ పాల్గొన్నారు.
నేలకొండపల్లి, జనవరి 9: మండలంలోని రాజేశ్వరపురం సొసైటీలో రైతుబంధు వారోత్సవాలను నిర్వహించారు. సొసైటీ చైర్మన్ కృష్ణమూర్తి, సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాస్, కిరణ్, వీరయ్య, ఏఈవో హరిత, సీఈవో వీరబాబు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, జనవరి 9: తిరుమలాయపాలెం సొసైటీ ఆధ్వర్యంలో రైతుబందు సంబరాలు జరుపుకున్నారు. సొసైటీ చైర్మన్ చావా వేణు, వైస్ చైర్మన్ చామకూరి రాజు, వ్యవసాయాధికారి ఎన్.సీతారామరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.