ముషీరాబాద్ : టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని 11 కేవీ బ్రాహ్మణ హాస్టల్, అంబర్పేట్, ఫీవర్ ఆసుపత్రి ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా 8తేదీ(నేడు)బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆ విభాగం ఏడీఈ ఎం.విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంట వరకు. బ్రాహ్మణ హాస్టల్ ఫీడర్ పరిధిలోని కమలానగర్, బ్రాహ్మణ హాస్టల్, ఓల్డ్ రామాలయం టెంపుల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు* అంబర్పేట్ ఫీడర్ పరిధిలోని అంబర్పేట్, ఆకాశ్‌నగర్, ఎంసీహెచ్ కాలనీ, రెడ్ బిల్డింగ్, రామక్రిష్ణనగర్, వినాయక్‌నగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫీవర్ ఆసుపత్రి ఫీడర్ పరిధిలోని అంజయ్య క్వార్టర్స్, ఫీవర్ ఆసుపత్రి, తెలంగాణ యువతి మండలి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.