భువనగిరి అర్బన్, డిసెంబర్ 19 : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలన్న డిమాండ్ న్యాయమైందేనని ఉస్మానియా దవాఖాన వైద్యుడు విజయ్భార్గవ్ అన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కోరుతూ చేపట్టిన జ్ఞానమాల సమర్పించే కార్యక్రమం సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా పట్టణంలోని వినాయక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం జ్ఞానమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి చేసిన సేవ, రాజ్యాంగం రచించిన వ్యక్తి చిరకాలం గుర్తుండాలంటే కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలన్నారు. సంవత్సరం నుంచి చేస్తున్న పోరాటానికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఫొటో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేశ్, అధ్యక్షుడు బట్టు రాంచంద్రయ్య, నాయకులు బెంజిమన్, బెల్లి కృష్ణ, టి.రవికుమార్, చిలుకమారి గణేశ్, భాస్కర్నాయక్, దేవేందర్, జహంగీర్, సలావుద్దీన్, జలేందర్, సురేశ్ పాల్గొన్నారు.
పెంచికల్పహాడ్లో.. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని కోరుతూ మండలంలోని పెంచికల్పహాడ్లో టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సిలువేరు మధు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల వేశారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లయ్య, భిక్షపతి, జమదగ్ని, గోపి, రమేశ్, స్వామి, నర్సింహ, ప్రవీణ్, ప్రభుదాస్, శివ, వినయ్ పాల్గొన్నారు.