మైలార్‌దేవ్‌పల్లి : నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లోని పద్మశాలిపురం , లక్ష్మిగూడ, హౌసింగ్‌బోర్డు కాలనీ లలో అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా పద్మశాలిపురం శ్మశాన వాటికలో పారుతున్న మురుగు నీటిని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డులో డ్రైన్ వాటర్ పొంగి పోర్లుతుందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కు తెలిపారు. శ్మశాన వాటికలో కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని పద్మశాలిపురం వాసులు ఎమ్మెల్యేకు వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ..పద్మశాలిపురం శ్మశానవాటిక అభివృద్ధి కోసం నిధులు మంజురయ్యా యన్నారు. త్వరలోనే శ్మశాన వాటిక చుట్టూ ప్రహారి నిర్మించి రోడ్లు వేయడానికి అధికారులకు ఆదేశించామన్నారు. శ్మశానవాటికలో మురుగు నీరు లేకుండా తక్షణమే పరిష్కరించాలని జలమండలి అధికారి సత్తార్‌ను ఆదేశించారు.
శ్మశాన వాటికలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మాజీ అధ్యక్షుడు సరికొండ వెంకటేష్ ,అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్,యూత్ అధ్యక్షుడు రఘుయాదవ్ ,రమేష్ ముదిరాజ్ ,సీహెచ్ నర్సింహ,యంజాల మహేష్రాజ్ ,గురం బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.