e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home ఆదిలాబాద్ పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

ఆదిలాబాద్‌ జడ్పీ సీఈవో కిషన్‌
పలు గ్రామాల్లో పర్యటన
భీంపూర్‌, మార్చి 18 : కోట్లాది రూపాయలతో చేపడుతున్న పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ సీఈవో కిషన్‌ సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి భీంపూర్‌, గోనా, ఇందూర్‌పల్లి గ్రామాల్లో పంటకల్లాలు, పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన పనులు, ఉపాధి హామీ పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ పంట కల్లాల నిర్మాణాలు పూర్తి చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, పల్లె ప్రకృతివనాల్లో మొక్కలను సంరక్షించేందుకు సర్పంచ్‌లు, కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సీఈవో వెంట జడ్పీటీసీ కుమ్ర సుధాకర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో వినోద్‌, పీఆర్‌ డీఈ శివరాం, సర్పంచులు మడావి లింబాజీ, బాదర్‌, టేకాం దాదారావు, కార్యదర్శులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement