
మక్తల్ రూరల్, డిసెంబర్ 18 : పట్టణంలోని మక్తల్ వ్య వసాయ మార్కెట్ యార్డుకు సంబంధించిన స్థలాలను క బ్జా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మా ర్కెటింగ్ శాఖ జేడీ ఇఫ్తేకార్ అన్నారు. నెహ్రూగంజ్లోని మార్కెట్ స్థలాలను కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చే యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సంగంబండ రోడ్డు వైపు ఉన్న మార్కెట్‌కు చెందిన ఖాళీ స్థలాలను శనివారం మార్కెట్ చైర్మన్ రాజేశ్గౌడ్తో కలిసి ఆక్రమణకు గురైన స్థలాలను జేడీ పరిశీలించారు. ఇటీవల నెహ్రూగంజ్‌కు రైతులు ధాన్యం తీసుకురావడానికి రోడ్ల కోసం వదిలి న ఖాళీ స్థలాలను కొందరు అక్రమంగా ఆక్రమించుకొని డ బ్బాలు వేశారని మార్కెట్ చైర్మన్ జేడీకి వివరించారు. డ బ్బాలను తొలగించాలని ఇది వరకు నోటీసులు ఇచ్చామని, అయినప్పటికీ పట్టించుకోడం లేదన్నారు. ఈమేరకు స్పందించిన మార్కెటింగ్ శాఖ జేడీ అ వసరమైతే మరోసారి నోటీసులు ఇచ్చి, అప్పటికీ తొలగించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. మార్కె ట్ యార్డుకు సంబంధించిన కోట్ల రూ పాయల విలువ చేసే స్థలాలను కబ్జా చేసిన వారు ఎంతటి వారైన వదిలి పె ట్టేదిలేదని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం
ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ మక్తల్ మార్కెట్ అ భివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. మార్కె ట్ యార్డులో కొనుగోలు దారులు తమ లైసెన్స్‌లను రెన్యూవల్ చేయించుకోవాలని, లేకపోతే పూర్తిగా రద్దు చేస్తామన్నారు. అలాగే వ్యాపారులు మార్కెట్ ఫీజులు చెల్లించాల ని, జీరో వ్యాపారం చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మార్కెట్ చైర్మన్ రాజేశ్‌గౌడ్ మాట్లాడుతూ మార్కెట్ కార్యాలయానికి నూతన భవనాల నిర్మాణం కో సం రూ.72 లక్షలతో ప్రతిపాదనలను మార్కెటింగ్ శాఖ క మిషనర్‌కు పంపించామని, నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం మక్తల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని సందర్శించిన మార్కెటింగ్ శాఖ జేడీ ఇఫ్తేకార్ను మార్కెట్ చైర్మన్ రాజేశ్‌గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ అనిల్‌కుమార్, డీఎంవో నాగమణి, సెక్రటరీ భారతి, డైరెక్టర్లు సాలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.