భువనగిరి అర్బన్, డిసెంబర్ 22 : గణిత దినోత్సవం సందర్భంగా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను పట్టణంలోని శ్రీవైష్ణవి కళాశాలలో బుధవారం నిర్వహించారు. రామానుజన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ పడాల శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మదిరె మల్లేశం మెమెంటోలను అందించారు. అలాగే పట్టణంలోని లక్ష్మీనరసింహ స్వామి డిగ్రీ కళాశాలలో రామానుజన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, పాటల పోటీలతో అలరించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు రమేశ్, లక్ష్మి, లత, అశ్విని, బాలరాజు, సుధ పాల్గొన్నారు. పట్టణంలోని దేదీప్య పాఠశాలలో జరిగిన రామానుజన్ జయంతి వేడుకల్లో ఉపాధ్యాయులు రంగారావు, ఎం.వెంకట్‌రెడ్డి, పి.రవి, అనూరాధ, స్వరాజ్యం పాల్గొన్నారు. జాగృతి డిగ్రీ, పీజీ కళాశాలల్లోనూ వేడుకలు నిర్వహించగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సూర్యనారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డి, అధ్యాపకులు సీహెచ్ నవీన్, బి.బస్వరాజు, బి.ఉపేందర్‌రెడ్డి, సీహెచ్ చంద్రశేఖర్, శిరీషా పాల్గొన్నారు.
ఘనంగా గణిత దినోత్సవం
మోత్కూరు : గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని పాటిమట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. రామానుజన్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అగ్గి రాములు పూలమాల వేసి నివాళులర్పించారు. గణిత శాస్త్రం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్. శంకర్, ఎం. లింగమల్లు, బి. వీరాచారి, పి. కృష్ణ, వి. నరేశ్, టి. ఉప్పలయ్య, కృష్ణవేణి పాల్గొన్నారు.
గుండాల కస్తూర్బాలో
గుండాల : గణిత శాస్త్ర దినోత్సవాన్ని మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం జరుపుకొన్నారు. గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రత్యేకాధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ రామానుజన్ గణిత శాస్త్రంలో చేసిన కృషిని వివరించారు. అనంతరం విద్యార్థులకు గణితంలో క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.