Nala Expansion | నాలా విస్తరణతో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం : విప్ ఆరెకపూడి గాంధీ

మియాపూర్ : వర్షాకాలంలో ముంపు సమస్య పునరావృతం కాకుండా నాలాల విస్తరణను చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గత ప్రభుత్వాలు వీటిని విస్మరించాయని తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతగా తీసుకుని పనులను ముమ్మరంగా చేపడుతుందన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రూ. 6 కోట్లతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను విప్ గాంధీ ప్రాజెక్టు అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ ఏండ్ల తరబడి ముంపుతో సతమతమవుతున్న ధరణీనగర్ను నాలా విస్తరణతో తాము రక్షించినట్లు పేర్కొన్నారు.
నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని, ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో ముంపు సమస్య నెలకొంటున్న ప్రాంతాలలో నాలాల విస్తరణను ముమ్మరంగా చేపడుతున్నామని, ప్రజల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమని విప్ గాంధీ పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాలలో తగు చర్యలు ముందస్తుగా చేయటం ద్వారా సమస్య పునరావృతం కాకుండా ఉంటుందన్నారు. నాలా పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని, చెత్త ఇతర వ్యర్థాలను నాలాల్లో వేయవద్దని గాంధీ కోరారు. జీహెచ్ఎంసీ, ప్రాజెక్టు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని విప్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డీఈ రాంచందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

