
యాదాద్రి / ఆత్మకూరు(ఎం), డిసెంబర్ 29 : సీఎం కేసీఆర్ రైతుబంధు నిధులు విడుదల చేయడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్ బుధవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు రాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంస్కరణలు చేపడుతున్నారన్నారు. రైతులంతా ఏకమై బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత తరుణంలో రైతులు వరికి బదులు ఇతర పంటలు సాగుచేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బూడిద నరేందర్, టీఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ బాబా, రైతుబంధు సమితి కన్వీనర్ పేరబోయిన సత్యనారాయణ, టీఆర్ఎస్ యువజన నాయకులు ఆకుల శ్రీనివాస్‌యాదవ్, నాయకులు రజనీకాంత్, గడ్డం చంద్రం, దేవపూజ అశోక్, ఆరె స్వామి, బండి వాసు, దండబోయిన వీరేశం, ఊట్కూరి రాజు, గ్యాదపాక క్రాంతి పాల్గొన్నారు. ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, జిల్లా డైరెక్టర్ కోరె భిక్షపతి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్స్ పంజాల వెంకటేశ్‌గౌడ్, మామిడి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్‌గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథగౌడ్, గ్రామ శాఖాధ్యక్షుడు కోరె వెంకన్న, మహిళా, మైనార్టీ, విద్యార్థి విభాగాల మండలాధ్యక్షుడు సోలిపురం అరుణ, ఎండీ.అజిమొద్దీన్, నాగరాజు, సత్యనారాయణ, అనంతరెడ్డి, అశోక్ పాల్గొన్నారు. ఆలేరు టౌన్ / గుండాల / ఆలేరు, ఆలేరు మండలంలలోని కొలనుపాకలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం, కౌన్సిలర్లు బేతి రాములు, రాయపురం నర్సింహులు, కందుల శ్రీకాంత్, సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, జంగ స్వామి, జంగ పరశురాములు, మామిడాల నర్సింహులు పాల్గొన్నారు. గుండాల మండలంలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దార సైదు లు, మండల యూత్ అధ్యక్షుడు అట్ల రంజిత్‌రెడ్డి, కొమ్మగళ్ల దయాకర్ పాల్గొన్నారు.