ఎస్ఎస్ఆర్ ప్రకారం రేట్లు పెంచితేనే వర్క్స్ చేపడుతాం
ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్ తక్కళ్లపల్లి సంపత్‌రావు
హనుమకొండ సిటీ, డిసెంబర్ 29 : విద్యుత్ శాఖ ఏ సమయంలో ఆదేశించినా సత్వరమే స్పందించి అభి వృద్ధి పనులు చేపట్టే విద్యుత్ కాంట్రాక్టర్లను ఎన్పీడీసీ ఎల్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్న దని ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్ తక్కెళ్లపల్లి సంపత్‌రావు అన్నారు. ఎస్ఎస్ఆర్ పెంపు అంశంపై ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల విద్యుత్ కాంట్రా క్టర్లు హనుమకొండ హంటర్‌రోడ్డులోని విద్యుత్ ఇంజి నీర్స్ భవన్లో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంపత్‌రావు మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్) ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 15 శాతం రేట్లు పెంచాలని పేర్కొన్నారు. కానీ, 2015-16 నుంచి ఇప్పటి వరకు కంపెనీ పెంచలేద న్నారు. ఒకప్పుడు కార్మికుడికి రోజుకు రూ.450 ఇస్తే పనికి వచ్చేవాడని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.750 ఇస్తేనే పనికి వస్తున్నాడని వివరించా రు. డీజిల్ ధర పెరిగినా పాత ఎస్ఎస్ఆర్ ప్రకారమే కంపెనీ కాంట్రా క్టర్లకు చెల్లింపులు జరుపుతుందని చెప్పారు. నెలనెలా బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేయడంతో కాంట్రాక్టర్లు ముందుగా పెట్టుబడి పెట్టి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సీఎండీ, ఎస్ఈ, డీఈలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా పనులు చేయించు కుంటున్నారని వివరించారు. రేట్లను పెంచితేనే పనులు చేస్తామని, లేదంటే బంద్ చేస్తామని జేఏసీ తీర్మానం చేసిందని సంపత్‌రావు వెల్లడించారు. జనవరి 1 నుంచి కాంట్రా క్టర్లు విద్యుత్ శాఖకు సంబంధించిన ఎలాంటి కాంట్రా క్టు పనులు చేపట్టరని ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్కు అల్టిమేటం జారీ చేశారు. సమావేశంలో జేఏసీ వైస్ ప్రెసిడెంట్ కందుల వెంకట్‌రెడ్డి(నిజామాబాద్), జనర ల్ సెక్రటరీ ఎల్ శ్రీనివాస్‌రెడ్డి(కరీంనగర్), వర్కింగ్ ప్రెసిడెంట్ గడియపు వేణుగోపాల్(మంచిర్యాల), ఇండ్ల అశోక్(ఆదిలాబాద్), చేపూరి నాగరాజు(రాజన్న సిరి సిల్ల), జెట్టి అంజయ్య(సిర్పూర్ కాగజ్‌నగర్) ట్రెజరర్ ఎస్ రఘు(జగిత్యాల), ఆర్గనైజింగ్ సెక్రటరీలు శ్రీధర్‌రెడ్డి(జనగామ), డీ శ్రీనివాస్(వరంగల్), డీ విజ య్‌కుమార్(బాన్సువాడ) తదితరులు పాల్గొన్నారు.