
నిజాంపేట, నవంబర్ 29 : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని రజాక్‌పల్లిలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో హనుమాన్ విగ్రహం, బొడ్రాయి, వెంకటాపూర్(కె) తండాలో సేవాలాల్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రైతు లు దేశ రైతాంగానికి ఆదర్శమని, ఇటువంటి సమయంలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తూ రైతులను ఆగం చేస్తుందన్నారు. పూజా కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సునీత, అనిల్‌కుమార్, కల్వకుంట, నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్లు కొండల్‌రెడ్డి, బాపురెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, రామాయంపేట మున్సిపాల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లు యాదగిరి, వెంకటేశం, రవీందర్, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఆత్మ కమిటీ మెంబర్ నాగరాజు, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మావురం రాజు, నిజాంపేట మాజీ సర్పంచ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు దయాకర్, నాగరాజు, కొమురయ్య, తిరుపతి, స్వామి ఆలయ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.