e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home జిల్లాలు ముమ్మరంగా నర్సరీల ఏర్పాటు

ముమ్మరంగా నర్సరీల ఏర్పాటు

గండీడ్‌, నవంబర్‌ 29 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం కావడంతో మరోసారి గ్రామాల్లోని నర్సరీల్లో 40వేల మొక్కలు పెంచే లా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకుగానూ ఉపాధి హా మీ పథకం ద్వారా మండలంలోని 49 గ్రామ పంచాయతీ ల్లో నర్సరీల ఏర్పాటును అధికారులు ముమ్మరం చేస్తున్నా రు. అన్ని గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు గానూ ట్యాంక్‌ల నిర్మాణం, మట్టిని పాలతీన్‌ కవర్లలో నింపే పనులు చేపడుతున్నారు. రాష్ట్రం పచ్చని హారంగా కనిపించేలా హరితహా రం కార్యక్రమం పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ప్రారంభించిన నాటి నుంచి ప్రతి ఏటా ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట వర్షాభావ పరిస్థితుల వల్ల నాటిన అన్ని మొక్కలు బతక లే కపోయాయి. తర్వాత నాటి నమొక్కలు అ న్ని బతికి అడవులను తలపిస్తున్నాయి. జిల్లా స్థాయిలో ఇప్పటికే సంబంధిత అధికారులు నర్సరీల ఏర్పాటుపై సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. గ్రామస్థాయిలో ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ కార్యదర్శి, సిబ్బంది, ప్రజా ప్రతినిధులందరికీ అ వగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గ్రామసభ ద్వారా నర్సరీలను ఏర్పాటు చేసి ప్రస్తుతం మొక్కలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. గ్రా మానికో నర్సరీని ఏర్పాటు చేసి గ్రామం అంతా మొక్కలు నాటేందుకు అవకాశం ఉం టుంది. మొక్కల పెంపకాన్ని మూడు భాగాలుగా విభజించి నర్సరీలను ఏర్పాటు చేస్తున్నా రు. 20వేల మొక్కలు, 40వేల మొక్కలు, లక్ష మొక్కలు పెంచే లా నర్సరీలను ఏర్పాటు చూ స్తున్నారు. చిన్న గ్రామాలు ఉ న్న చోట 20 వేలు, పెద్ద పంచాయతీల్లో 40 వేలు అటవీ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్న నర్సరీల్లో లక్ష మొక్కులు పెంచుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
49 నర్సరీల్లో 35 లక్షల మొక్కలు
మండలంలోని 49 గ్రామ పంచాయతీల్లో 49 నర్సరీలు ఏర్పాటు చేశారు. 39 నర్సరీలను ఉపాధి హామీ ద్వారా మొక్కల పెంపకం చేపడుతారు. 10 నర్సరీలను అటవీ శా ఖ ద్వారా పెంచుతున్నారు. 49 నర్సరీల్లో 35 లక్షల మొక్క లు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉపాధిహామీ పథకం ద్వారా 25 లక్షలు, అటవీ శాఖ ద్వారా 10 లక్షల మొక్కలు పెంచనున్నారు.
పెంచనున్న మొక్కలు
నర్సరీల్లో పెంచనున్న మొక్కలు మునగా, టేకు, కానుగ, చింత, వేప, తురక వేప, నల్లమద్ది, మారేడు, వెదురు, అల్లనెరేడు, ఇప్ప, ఉసిరి, నిమ్మ, సితాఫలం, సుబాబులు, ఈ త, ఇతర పండ్ల, పూల మొక్కలను పెంచనున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement