
ఎమ్మెల్యే బీరంహర్షవర్ధన్రెడ్డి
చిన్నంబావి, నవంబర్ 29 : జూరాల చివరి ఆయకట్టు ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు సింగోటం- గోపాల్దిన్నె లింక్కెనాల్తో త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుందని, ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులకు రూ.126 కోట్లతో టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని ఎమ్మెల్యే బీరంహర్షవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం చిన్నంబావి మండలం కొప్పునూరు రైతువేదిక భవనంలో మండలానికి చెందిన 42 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 15 మందికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను వారి కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు. అనంతరం కొప్పునూరులో రూ.10లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా అన్ని వర్గాల వారికి లబ్ధిచేకూర్చే విధంగా ఉంటాయన్నారు. దేశంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఒకతీరు, ఇతర రాష్ర్టాల పట్ల మరొకతీరుగా వ్యవహరిస్తున్నదన్నారు. అనంతరం కొప్పునూరులో జరిగిన కార్యకర్తల గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాల్లో ఎమ్మెల్యే బీరం హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ, కొప్పునూరు విండో చైర్మన్ బగ్గారి నర్సింహారెడ్డి, సర్పంచ్ నందికౌసల్యారెడ్డి, ఎంపీటీసీ తగరంలక్ష్మి, ఉపసర్పంచ్ ఆనంద్యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మద్దిలేటి, నాయకులు చిన్నారెడ్డి, రాజేశ్వర్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, చిదంబర్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, ఉగ్రనర్సింహ, కురుమయ్య, బ్రహ్మం, కానుగరాజు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.