
బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్
కళాశాలలో పట్టభద్రుల దినోత్సవం
కుత్బుల్లాపూర్, నవంబర్ 27: మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో కృత్రి మ మేధస్సు ఎంతగానో అవసరమని దానికి దీటుగా మహిళలు రాణించాలని జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఫ్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. బాచుపల్లిలోని బీవీఆర్ఐటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఆరో పట్టభద్రుల దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో 385 మంది విద్యార్థినులకు పట్టాలతో పాటు బంగా రు ఫథకాలను అందజేశారు. వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థినులు వినూత్నంగా ఆలోచనలు చేసి తమ జీవితంలో కొన్ని అంశాలను ఉదాహరించుకొని అన్ని రంగాల్లో రాణించాలని తన సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, ప్రిన్సిపాల్ డా.కేవీఎన్ సునీత, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.