
ఎమ్మెల్సీ బండా ప్రకాశ్
చేగుంట,డిసెంబర్ 26: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కామ్రేడ్ కేవల్ కిషన్ , ఆయన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. కేవల్‌కిషన్ 61వ వర్ధంతి సందర్భంగా చేగుంట మండల పరిధిలోని పోలంపల్లి చౌరస్తాలోని కేవల్ కిషన్ సమాధుల వద్ద జాతరలో ఎమ్మెల్సీ బండాప్రకాశ్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు రామకృష్టయ్య, కేవల్ కిషన్ కు టుంబ సభ్యులు ఆనందదేవి,రాజు,వీణరాణి, చేగుం ట మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మ్యాకల పరమేశ్, నాచారం దేవాస్థానం మాజీ చైర్మన్ యాదగిరితో పాటు పలువురు నాయకులు ఆదివారం కేవల్‌కిషన్ స మాదుల వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేవల్ కిషన్ నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడి, పేదలకు భూమిని పంపిణీ చేసిన వ్యక్తి అన్నారు. ప్రభుత్వం కేవల్ కిషన్ జాతర అధికారంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ తెలిపారు. ఇక్కడి స్థలం రిజర్వ్ ఫారెస్టు ఆధీనంలో ఉండగా, జాతర కోసం ఎకరం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిదని, కావాల్సిన కమ్యూనిటీ హాల్ మంజూరుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షు డు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అక్షయ్మార్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి జగన్, మెదక్ జిల్లా అధ్యక్షుడు రామకిష్టయ్య, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృపాసాగర్, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు పరమేశ్, నిజాంపేట్ జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, సర్పంచ్ నిర్మల, నాయకులు ఆంజనేయులు, సోమసత్యనారాయణ, సత్యం, సాయికుమార్ , సిద్ధిరాములు, బోనాల భిక్షపతి, నర్సింహులు, భిక్షపతి, సిద్ధిరాములు, స్వామి, వివిధ గ్రామాలకు చెందిన ప్రజ లు పాల్గొన్నారు.
సీపీపీఎం ఆధ్వర్యంలో…..
కామ్రేడ్ కేవల్ వర్ధంతి సందర్భంగా చేగుంట నుంచి పోలంపల్లి చౌరస్తా కేవల్ కిషన్ సమాధుల వరకు మెదక్ జిల్లా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లేశం, నాయకులు సైకిల్‌యాత్ర నిర్వహించారు. అనంతరం సమాధుల వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు బస్వరాజు, సంతోశ్, నాగేందర్‌రెడ్డి, ప్రవీణ్, భాను, కొమురయ్య, వెంకటరామ్‌రెడ్డి, బాలేశ్, నవీన్ ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీలో..
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 26: కామ్రే డ్ కేవల్ కిషవ్ వర్ధంతి పురస్కరించుకొని ఆ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లోని కేవల్ కిషన్ విగ్రహానికి మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రామాయంపేలో..
రామాయంపేట, డిసెంబర్ 26: రామాయంపేట పట్టణంలోని కామ్రేడ్ కేవల్ కిషన్ 61వ వర్ధ్దంతి నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులతో కామ్రేడ్ కేవల్ కిషన్ చిత్ర పటానికి కార్మికులతో సీఐటీయూ మండల కార్యదర్శి సత్యం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.