మంచిర్యాల అర్బన్, జూన్ 25 : జిల్లాలో రెండో రోజైన శుక్రవారం ఉపాధ్యాయులకు టీకా వేసే కార్యక్రమం కొనసాగింది. జిల్లాలోని 17 పీహెచ్‌సీలు, నాలుగు యూపీహెచ్‌సీలు, మూడు సీహెచ్‌సీల పరిధిలో శుక్రవారం 836 మంది ఉపాధ్యాయులు టీకాలు వేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది టీకా కోసం బారులు తీరు తున్నారు. ఉపాధ్యాయులు, ఇతరులు జిల్లా వ్యాప్తంగా 2999 మంది కోవీషీల్డ్, 10 మంది కోవాగ్జిన్ టీకా వేసుకున్నారు.
తాండూర్‌లో 150 మందికి కొవిడ్ టీకా
తాండూర్, జూన్ 25 : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 150 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి కుమారస్వామి తెలిపారు. 30 మంది ప్రైవేట్ టీచర్లు, 15 మంది ప్రభుత్వ టీచర్లు, 95 మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు కిరాణా వ్యాపారులు, రేషన్ డీలర్లు, ఫర్టిలైజర్ షాపుల యజమానులు, కూరగాయల వ్యాపారులు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నరేశ్, సిబ్బంది హరీశ్, హకీం, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది ఉన్నారు.
భీమిని పీహెచ్సీలో 102 మందికి..
కన్నెపల్లి, జూన్ 25 : భీమిని పీహెచ్సీలో 102 మంది ఉపాధ్యాయులు, ఆటోడ్రైవర్లకు వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం సూ చించిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. 55 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
వ్యాక్సినేషన్ ను పరిశీలించిన ఎంపీపీ
బెల్లంపల్లిరూరల్, జూన్ 25: మండలంలో సూపర్ స్ప్రెడర్లకు కొనసాగిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్‌ను శుక్రవారం ఎంపీపీ గోమాస శ్రీనివాస్ పరిశీలించారు. తప్పకుండా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలని వైద్య సిబ్బందిని కోరారు. గ్రామీణులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు
బెల్లంపల్లిరూరల్, జూన్ 25 : బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 51 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 11 పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెచ్‌ఈవో సమ్మయ్య తెలిపారు.
తాండూర్ మండలంలో..
తాండూర్, జూన్ 25 : తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 33 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి కుమారస్వామి తెలిపారు.