కొత్తూరు, డిసెంబర్ 18: ఒమిక్రాన్‌తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఇంతకు ముందు వ్యాక్సిన్ కొరత ఉండేదని, ఇప్పడు కావాల్సినంత వ్యాక్సిన్ ఉందని వివరించారు. అందువల్ల అలసత్వం వహించకుడా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా పంట మార్పిడి సూచనలు పాటించాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం నిలువలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అంతే కాకుండా యాసంగిలో వరి కొనబోమని కేంద్రం ప్రభుత్వ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం ఉట్టిపడుతుందన్నారు. గ్రామాల్లో రోడ్ల వెంబడి చెట్లను చూస్తే ముచ్చటేస్తుందన్నారు. అంతేకాకుండా పల్లెప్రకృతి వనాల్లో పెంచిన చెట్లు పండ్లు తెంపుకొని తినే స్థితికి రావడం గొప్ప విషయమన్నారు. గ్రామాల్లోని సమస్యలపై అధికారులు తక్ష ణం స్పందించి పరిష్కరించాలన్నారు. మండల సర్వసభ్య సమావేశానికి రాని అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. సర్పంచ్‌లు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
క్రిస్మస్ కానుకలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశం మందిరంలో 22 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని 150 మంది క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, వైస్ ఎంపీపీ శోభ, ఎంపీడీవో బాల్‌రెడ్డి, తహసీల్దార్ రాములు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం చేయూత
నందిగామ, డిసెంబర్ 18 : ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన శ్రీనుకు రూ.60వేలు, స్రవంతికి రూ.60వేలు, సురేశ్‌కు రూ.60వేలు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను శనివారం ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడినప్పుడు వారికి ప్రభుత్వం అండగా ఉంటున్నదని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనేక మంది పేదలను ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో చేగూర్ పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, నాయకులు జెట్ట రమేశ్, మధు, నరేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
దైవ చింతనతో మానసిక ప్రశాంతత
నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో శనివారం శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు కాట్న లతాశ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో కొత్తూర్ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబాల్‌నాయక్, మాజీ సర్పంచ్ శ్రవన్‌కుమార్, నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీహరి, పురుషోత్తం, శ్రవణ్‌గౌడ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.