
అధికారులపై ఎమ్మెల్యే పైళ్ల సీరియస్
భువనగిరి అర్బన్, డిసెంబర్ 17: గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, సీసీరోడ్లు, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల తొలగింపు పనులు రెండు రోజుల్లో ప్రారంభించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం ఆయన మండలంలోని బొల్లేపల్లి గ్రామాన్ని సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన చోట అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్న స్థలాన్ని సేకరించేందుకు సంబంధిత భూమి సర్వే చేసి స్థలాన్ని కేటాయించి వెంటనే అప్పగించాలని తాసీల్దార్‌ను ఆదేశించారు. వార్డుల్లో కలియ తిరిగి రోడ్డు మధ్యలో నిరుపయోగంగా ఉన్న డ్రైనేజీని ఉపయోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాల్‌కు ప్రభుత్వ భూమిని కేటాయించాలని తాసీల్దార్‌ను కోరారు. గతంలో ఎస్సీ శ్మశానవాటిక, రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించలేదని, డ్రైనేజీలో వాడే సిమెంట్ కుండీలను(బిల్లలు) దుర్వినియోగం చేయడంపై ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సక్రమంగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, స్థానిక సర్పంచ్ పెద్ది బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, జక్క రాఘవేందర్‌రెడ్డి, కేశవపట్నం రమేశ్, అబ్బగాని వెంకట్‌గౌడ్, సందెల సుధాకర్, సామల వెంకటేశ్, ర్యాకల శ్రీనువాస్, పడాల వెంకటేశ్వర్లు, జిట్ట కృష్ణారెడ్డి, గోద చిన్నశ్రీను, బి.అశోక్, వెంకట్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు వనం రమేశ్, ప్రవీణ్‌కుమార్, రవికుమార్, భగవాన్‌నాయక్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.