ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 17: మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ముత్తూట్ ఫైనాన్స్ సహకారంతో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిం ది. ఈ శిబిరంలో గుండె, కిడ్నీ, కాలేయం, బీపీ, షుగర్ వంటి పలు రకాల వ్యాధులకు వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మం దులను అందజేశారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ ఆండాళుగిరి, ఎంపీటీసీ మంగారవీందర్ ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఇబ్రహీంపట్నం ఎంపీడీవో మహేశ్‌బాబు పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాలు నిర్వహించాలి
తలకొండపల్లి, డిసెంబర్ 17: గ్రామీణ ప్రాంతాల్లో స్వ చ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని దేవునిపడకల్ సర్పంచ్ శ్రీశైలం అన్నారు. శుక్రవారం గ్రామంలో అవేర్ రూరల్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 236 మందికి వివిధ రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రఘు, ఉపసర్పంచ్ తిరుపతి, డాక్ట ర్లు సరిత, అశోక్‌కుమార్, డైరెక్టర్ లక్ష్మి, కార్యదర్శి వెం కన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లింగరావుపల్లిలో రక్తదాన శిబిరం
మండలంలోని లింగరావుపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆమన్‌గల్లు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 55 మంది రక్తదానం చేసినట్లు క్లబ్ గవర్నర్ రఘు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రమేశ్, చైర్మన్ అంజయ్య, పాషా పాల్గొన్నారు.