నర్చరింగ్ నైబర్‌హుడ్ చాలెంజ్ పోటీలో టాప్‌టెన్‌లో గ్రేటర్
దేశవ్యాప్తంగా 63 నగరాలతో పోటీపడి నిలిచిన సిటీ
25 నగరాలను ఎంపిక చేయగా, మొదటి పది స్థానాల్లో చోటు
వరంగల్, జనవరి 17: స్మార్ట్‌సిటీలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన నర్చరింగ్ నైబ ర్హుడ్ చాలెంజ్ పోటీలో గ్రేటర్ వరంగల్ టాప్‌టెన్ లో నిలిచింది. 2020 నవంబర్‌లో కేంద్రప్రభుత్వం స్మార్ట్‌సిటీ నగరాల మధ్య పోటీ ప్రారంభించింది. ఇం దులో భాగంగా శిశువులు, సంరక్షకులకు మెరుగైన సౌ కర్యాలు కల్పించేందుకు నర్చరింగ్ నైబర్‌హుడ్ చా లెంజ్ పోటీ నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 63 నగరాలు పాల్గొనేందుకు ప్రతిపాదనలు పంపించా యి. గతేడాది ఫిబ్రవరిలో వాటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం 25 నగరాలను ఎంపిక చేసింది. దానిలో మొదటి పది స్థానాల్లో గ్రేటర్ వరంగల్ చోటు దక్కిం చుకుంది. ఈ చాలెంజ్‌లో భాగంగా హనుమకొండ శ్రీదేవి మాల్ పక్కన ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆధు నీకరించారు. అందులోని పిల్లల కోసం ఫుట్‌పాత్‌లు, చిల్డ్రన్ పార్కును అనుసంధానం చేసి ఇంటరాక్టివ్ గేమ్ లు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతోపాటు 3 నుంచి 9 సంవత్సరాల వయస్సు గల 50 మంది పిల్ల లకు సైక్లింగ్, వాకింగ్ పోటీలు, జుంబా డ్యాన్స్ ఆర్ట్ వర్క్స్ నిర్వహించారు. అంగన్ వాడీ కేంద్రం వద్ద రహదారిపై జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేసి పిల్లలకు రోడ్డుభద్రత కల్పించారు. అదేవిధంగా బాలసముద్రం లో పెట్ పార్కుతోపాటు పెంపుడు కుక్కలకు ఆట వస్తు వులను ఏర్పాటు చేసిన ప్రతిపాదనలను గ్రేటర్ కార్పొ రేషన్ సమర్పించింది. వీటన్నింటిని పరిగణలోకి తీసు కున్న కేంద్ర ప్రభుత్వం టాప్ టెన్ నగరాల్లో వరంగల్ కు చోటు కల్పించింది. ఈ పోటీలో గెలుపొందిన నగ రాలకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు.
టాప్ 10 నగరాలు ఇవే..
వరంగల్‌తోపాటు బెంగళూరు, హుబ్లీ, ఇండోర్, జబల్పూర్, కాకినాడ, కొచ్చి, కోహిమా, రూర్కెలా, వడోదర నగరాలు ఉన్నాయి.
హర్షణీయం: మేయర్
నర్చరింగ్ నైబర్‌హుడ్ చాలెంజ్ పోటీలో గ్రేటర్ వరంగల్ టాప్ టెన్‌లో నిలువడం హర్షణీయం. ప్ర ణాళికాబద్ధంగా కృషి చేసిన అధికారులకు అభినంద నలు. దీంతో నగర కీర్తి దేశ వ్యాప్తమయ్యింది. చివ రి వరకు ఇదే స్ఫూ ర్తితో ముందుకు సాగి టాప్ వన్ గా నిలిచేలా కృషి చేయాలి.
మరిన్ని సౌకర్యాలు : కమిషనర్
పిల్లలు, శిశువులకు మరిన్ని సౌకర్యాలు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటాం. ఫిబ్రవరి 2022 వరకు ఎంహెచ్ నగర్లో మైక్రో పార్కు, క్రిస్టియన్ కాలనీలో ఉన్న పార్కులను మరింత అభివృద్ధి చేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకువస్తాం.