
24 కిలోమీటర్లు 7 గ్రామాలకు అందుబాటులో డబుల్‌లైన్ బీటీ రోడ్డు
మొదటి విడతగా 11 కిలోమీటర్లకు రూ. 15 కోట్ల నిధులు మంజూరు
3.5 కిలోమీటర్ల వరకు పూరైన రోడ్డు
మనోహరాబాద్ ,నవంబర్13:తెలంగాణ ప్రభు త్వం ఏర్పడిన అనంతరం మారుమూల గ్రామాల రోడ్డు మార్గాలకు మహర్దశ పట్టింది. ఇప్పటికే ఆ యా గ్రామాలకు సింగిల్ లైన్ బీటీ రోడ్లను ప్రభు త్వం నిర్మించింది. నిరంతరం రద్దీగా ఉండే సింగిల్ లైన్ రోడ్డు మార్గాలను ప్రభుత్వం గుర్తించి వాటిని డబుల్‌లైన్‌గా మార్చేందుకు కృషి చేస్తు న్నది. తాజాగా శివ్వంపేట, మనోహరాబాద్, తూ ప్రాన్ మూడు మండలాల్లో నిరంతరం రాకపోకలు సా గుతూ రద్దీగా ఉండే గ్రామాలను కలుపుతూ 24 కిలోమీటర్ల మరో డబుల్‌లైన్ రోడ్డు మార్గం నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి 11 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి మొదటి విడుతగా రూ. 15 కోట్లు మంజురయ్యాయి. ఇప్పటికే 3.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తవ్వగా, మిగితా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే 7 గ్రామాలకు, పల్లెలకు, లంబాడీ తండాలకు ప్రయాణం సులభతరమవుతుంది.
శభాష్‌పల్లి టూ మల్కాపూర్ …
శివ్వంపేట మండలం శభాష్‌పల్లి నుంచి మనోహరాబాద్ మండలంలోని పోతారం, పాలాట, రామాయిపల్లి మీదుగా తూప్రాన్ మండలంలోని ఘనపూర్, యావాపూర్, నర్సంపల్లి, లంబాడీ తండాలను కలుపుతూ మల్కాపూర్ వరకు సింగిల్‌లైన్ బీటీ రోడ్డు అందుబాటులో ఉంది. ఈ రో డ్డు గుండా ప్రయాణం చేస్తే తక్కువ సమయంలో తూప్రాన్-గజ్వేల్, తూప్రాన్ – నర్సాపూర్‌తో పా టు జాతీయ రహదారికి అతి తక్కువ సమయం లో చేరుకోవచ్చు. ఎక్కువశాతం ప్రజలు, రైతులు ఈ మార్గాన్ని ఎంచుకొని రాకపోకలు సాగిస్తుంటా రు.ఈ రోడ్డును డబుల్‌లైన్ చేస్తే మూడు మండలాల్లోని ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం 24 కిలోమీటర్లు ఉండగా మొదటి విడతగా 11 కిలో మీటర్ల డబుల్‌లైన్ రోడ్డు పనులకు రూ. 15 కోట్ల నిధులు మంజూరయ్యాయి. శివ్వంపేట మం డలం శభాష్‌పల్లి నుంచి మనోహరాబాద్ మండలంలోని పోతారం, పాలట మీదుగా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రామాయిపల్లి వరకు 3.5 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తయ్యాయి. రామాయిపల్లి నుంచి యావాపూర్ వరకు రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే రామాయిపల్లి, ఘనపూర్, యావాపూర్, నర్సంపల్లి గ్రామస్తులకు రోడ్డు సమస్య తీరనున్నది.