టార్పాలిన్లు, గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలి
తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్‌మిశ్రా
భూపాలపల్లిరూరల్, నవంబర్ 11: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువా రం కలెక్టర్ కార్యాలయంలో వానకాలం సీజన్లో పండించిన వడ్ల కొనుగోలుపై సమీక్షించారు. జిల్లా లో లక్షా 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొను గోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని, ఇందు కోసం 160 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్ర ణాళికలు రూపొందించామని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యాన్ని ఎలాంటి ఆరోపణలు రాకుండా రైతుల నుంచి సమయానికి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ముందస్తుగా ఎలక్ట్రా నిక్ వేయింగ్ మిషన్లను పరీక్షించుకోవాలని, తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలని సూ చించారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలని, ధాన్యాన్ని మిల్లులకు తరలించేం దుకు రవాణా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. సరైన సమయంలో రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా చూడాలని, అధికారులు అప్ర మత్తంగా ఉండి కొనుగోళ్లలో ఎలాంటి సమస్య రా కుండా చూడాలని, ఒకవేళ తలెత్తితే వెంటనే తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. కా ర్యక్రమంలో జేసీ కూరాకుల స్వర్ణలత, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్, మేనేజర్ రా ఘవేందర్, జిల్లా సహకార అధికారి మద్దిలేటి, ఏవో విజయ్‌భాస్కర్, డీఆర్డీవో పురుషోత్తం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవి, ప్ర ధాన కార్యదర్శి రేపాల్, జీసీసీ మేనేజర్ తదిత రులు పాల్గొన్నారు.
బాలుడిని తల్లికి అప్పగించిన కలెక్టర్
తనకు ఇష్టం లేకుండా తన కుమారుడిని విక్ర యించారని రేగొండ మండలం చెన్నాపూర్ గ్రా మానికి చెందిన మహిళ కలెక్టర్ భవేశ్మిశ్రాను కలి సి తన కొడుకుని అప్పగించాలని కోరింది. దీంతో ఆయన బాలల సంరక్షణ అధికారులతో మాట్లాడి గురువారం కలెక్టర్ కార్యాలయంలో తల్లికి బాలు డిని అప్పగించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్, సీడబ్ల్యూసీ చైర్మన్ వేణుగో పాల్, బాల రక్షాభవన్ కో-ఆర్డినేటర్ శిరీష, డీసీ పీవో హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మహిళల అభ్యున్నతికి కృషి చేయండి
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సం బంధిత అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో మహిళల అభ్యున్నతి కోసం చేపట్టిన కా ర్యక్రమాలపై సమీక్షించారు. స్వయంసహాయక సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు అర్హత ఉన్న మహిళలను గుర్తించి కొత్తగా గ్రూపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. నిర్దేశిత లక్ష్యం మేరకు బ్యాంకు లింకేజీ రుణాలను సకా లంలో అందించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో డీఆర్డీవో పురుషోత్తం, అదనపు ఆర్డీవో సురేశ్, డీపీఎంలు, ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.
తహసీల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
గణపురం: మండల తహసీల్దార్ కార్యాలయా న్ని గురువారం కలెక్టర్ భవేశ్‌మిశ్రా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. మండలంలోని సింగరేణి, జెన్కోలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని తహసీల్దార్ సతీశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించి వారి మన్ననలు పొందాలని సూచిం చారు. కార్యక్రమంలో డీటీ సత్యనారాయణ, ఆర్ఐ సాంబయ్య, వీఆర్వోలు శ్రావణ్, శ్రీనివాస్ ఉన్నారు.