జనవరి రెండో వారం కల్లా పూర్తి కావాలి
ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని అనుసరించాలి
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, పోలీస్ శాఖ అధికారులతో సమావేశం
ములుగుటౌన్, నవంబర్11: భక్తుల సౌకర్యా ర్థం చేపట్టనున్న మేడారం జాతర అభివృద్ధి పను లు ప్రారంభించాలని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య సూచించారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఆర్ అండ్‌బీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, పోలీ స్ శాఖ అధికారులతో మేడారం జాతరపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరి జన సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ జాతరకు లక్షల మంది భక్తులు వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూడాలన్నారు. జాత రకు మూడు నెలల సమయం ఉన్నందున ప్రభు త్వ నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల నియ మావళిని అనుసరిస్తూ ఆన్‌గోయింగ్ వర్క్స్‌కు టెండర్ పిలిచేలా సంబంధిత అధికారులకు ఆదే శాలు జారీ చేశామన్నారు. ఆయా శాఖల నుంచి పనులకు సంబంధించిన ఎస్టిమేషన్ తీసుకుంటు న్నామని తెలిపారు. తాడ్వాయి-నార్లాపూర్, చిన్న బోయినపల్లి-కొండాయి, పస్రా-మేడారం రోడ్లు, హెలీప్యాడ్ మరమ్మతులు, గెస్ట్‌హౌస్ నిర్మాణం, కాల్వపల్లి- ఊరట్టం అప్రోచ్ సీసీ రోడ్లు, చల్వాయి నుంచి బుస్సాపురం పనులకు సంబంధించి టెండ ర్లు పిలువాలని సూచించారు. డ్రింకింగ్ వాటర్, మరుగుదొడ్లు తదితర సౌకర్యా లు కల్పించడంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నా రు. పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంత రం సీసీ కెమెరాలు, ఎల్ఈ డీ స్క్రీన్ల ద్వారా ప ర్యవేక్షించాలన్నారు. చలువ పందిళ్లు, పార్కింగ్ ప్ర దేశాలు, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జనవరి రెండో వారం కల్లా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జాత రను విజయవంతం చేసేందు కు అధికారుల సమ న్వయం తప్పనిసరి అన్నారు. డీఆర్వో రమాదేవి, ఏఎస్పీ సాయిచైతన్య, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రకా శ్, ఆర్అండ్బీ, ఆర్‌డబ్ల్యూఎ స్, పీఆర్ ఈఈలు వెంకటేశ్, మాణిక్యరావు, వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో శ్యాంకుమార్, డీఈలు పాల్గొన్నారు.