ములుగుటౌన్, డిసెంబర్10: జిల్లాలో 38,829 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్‌కు ఎగుమతి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 19, 777 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపించామని, మిగిలిన బి య్యాన్ని త్వరగా ఎగుమతి చేయాలని కలెక్టర్ ఎస్. కృష్ణఆదిత్య సూచించారు. కలెక్టరేట్లో సోమవారం రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ పంటకు గిట్టుబాట ధర కల్పించి రైతు లు నష్టపోకుండా చూడాలని మిల్లర్లను ఆదేశించారు. జిల్లాలో 170 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 20 లక్షల గన్నీ బ్యాగులు సరఫరా చేశామని చెప్పారు. మరో 10 లక్షల బ్యాగులు అందుబాటు లో ఉంచాలని అధికారులను అదేశించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి అరవింద్‌రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్‌కుమార్, కార్యదర్శి వాసుదేవ రెడ్డి, కోశాధికారి విజేందర్ పాల్గొన్నారు.
నాణ్యమైన బియ్యం అందజేయాలి
గోవిందరావుపేట : ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందించే బియ్యంలో రైస్ మిల్లర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ములుగు ఆర్డీవో రమాదేవి అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉన్న సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) నిల్వ ల సెంటర్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని తీసుకొని గడువులోగా బియ్యాన్ని అందించాలని వారి కి సూచించారు. కార్యక్రమంలో అధికారులు, రైస్‌మిల్లర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.