
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి
నేరేడ్మెట్, జనవరి 9: సంస్కృతి సంప్రదాయాలకు పండుగలు ఒక ప్రతీక అని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి అన్నారు. ఆదివారం గోదావరి రచయితల సంఘం, అక్షర కౌముది సంస్థ, నేను సైతం యూట్యూబ్ చానల్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సంక్రాంతి కవితోత్సవం అంతర్జాల వేదిక ద్వారా కవి సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ .. సంక్రాం తి పండుగ అంటే పల్లె పండుగ అని, దాని వెనుక ఎన్నో వైవిధ్యమైన సంస్కృతి సాహిత్య కళలు దాగి ఉన్నాయన్నారు. తెలుగునాట సంక్రాంతి పెద్ద పండుగ అని, ఆంధ్రప్రాంతంలో కోడి పందాలకు పెట్టింది పేరు అని అన్నారు. హరిదాసు కీర్తనలు సర్వమత సమ్మేళనంకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అనంతరం డాక్టర్ చెన్నయ్య మాట్లాడుతూ.. కనుమరుగవుతున్న ఆప్యాయత అనురాగాల బంధాలను కలిపేది ఇలాంటి పండుగలేనని అ న్నారు. పల్లె జీవనం పండుగలోనే తెలుస్తుందని, సంక్రాంతి పండుగ అంటే రంగవల్లులకు పెట్టింది పేరని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర కౌముది సంస్థ అధ్యక్షుడు తులసీ వెంకట రమణాచార్యులు, డాక్టర్ నాగేశ్వర్రావు, బల్లూరి ఉమాదేవి, గుడిపూడి రాధికారాణి, శరత్చంద్ర, సత్యరాజేశ్, మూర్తి శ్రీదేవి, వెంకటకృష్ణ, రాందాస్, సంతోశ్‌కుమార్ శర్మ, వెంకట రమణ పాల్గొన్నారు.