చేవెళ్ల టౌన్, నవంబర్ 8: దివంగత నేత పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాద య్య అన్నారు. సోమవారం రాజేందర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని చేవెళ్ల మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, నాయకులతో కలిసి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, మండలాధ్యక్షుడు ప్రభాకర్, మాజీ మండలాధ్యక్షుడు రమేశ్వర్‌రెడ్డి, షాబాద్ జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు మాణిక్యరెడ్డి, నర్సింహులు, లక్ష్మీకాంత్‌రెడ్డి, రాములు, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
పేదల అభ్యున్నతికి రాజేందర్‌రెడ్డి కృషి
షాబాద్, నవంబర్ 8: దివంగత నేత పట్నం రాజేందర్‌రెడ్డి పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని, ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రాజేందర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని పీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చేవెళ్ల, కొడంగల్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డిలతో కలిసి ఆయన రాజేందర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముద్దెంగూడ, గొల్లూరుగూడ గ్రామాల్లో రాజేందర్‌రెడ్డి విగ్రహాలకు కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాజేందర్‌రెడ్డి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. పీఆర్ఆర్ ట్రస్టు ద్వారా పేదలకు ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నా రు. ప్రతి ఏడాది రాజేందర్‌రెడ్డి స్మారకార్థం జిల్లా స్థాయి క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం లో ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, మతీన్, కోట్ల మహేందర్‌రెడ్డి, శేరిగూడెం వెంకటయ్య, జడల రాజేందర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, నర్సింహారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కొలన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా లీగల్ అడ్వైజర్ సతీశ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, మల్లేశ్, రమేశ్‌యాదవ్, వెంకటయ్య, ఇమ్రాన్, ఇబ్రహీం, యాదయ్య, దర్శన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.