ధారూరు, నవంబర్ 8: గతంలో అటవీ ప్రాంతంలో చెట్ల ను తొలగించి పంటసాగు చేసుకుంటున్న ఎస్టీ రైతుల పోడు భూముల పరిష్కారానికి గ్రామ సభ నిర్వహించి నట్టు ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి తెలిపారు. సోమవా రం ధారూరు మండల పరిధిలోని రాంపూర్ తండాలో పోడు భూముల సమస్యల పరిష్కారానికి గ్రామ సభ నిర్వ హిం చారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గతంలో అటవీ ప్రాంతంలో చెట్లను తొలగించి పంటలను సాగు చేసుకుంటున్న ఎస్టీ రైతులకు అటవీ శాఖ హక్కుల చట్టం పై అవగాహన కల్పించామన్నారు. గ్రామ కమిటీలో సర్పంచ్ అధ్యక్షతన, రెవెన్యూ, అటవీ శాఖ, గిరిజన సం క్షేమ శాఖల సిబ్బందితో పాటు, ఏడుగురు గిరిజన రైతు లను ఈ కమిటీలో సభ్యులుగా ఉండాలని, వారిలో ము గ్గురు మహిళలు ఉండేలా చూడాలని తెలిపారు. 2005 సంవత్సరం కంటే ముందు నుంచి పంటసాగులో ఉన్న అర్హులైన రైతుల నుంచి వివరాలు సేకరిస్తామన్నారు. ప్రతి రైతు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సాగు చేసుకున్న రైతు ల వివరాలు గ్రామ, మండల కమిటీల్లో తీర్మానం అనంతరం సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కార్యక్రమం లో ధారూరు జడ్పీటీసీ సుజాత, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, ఆర్ఐ చంద్రమోహన్, సర్పంచ్ పాండు, నాయకులు రాజునాయక్, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతులు దరఖాస్తులు ఇవ్వాలి
బొంరాస్‌పేట, నవంబర్ 8 : పోడు భూములు సాగు చేసు కుంటున్న రైతులు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసు కోవాలని తాసిల్దార్ షాహెదాబేగం కోరారు. సోమవారం మం డలంలోని కొత్తూరు గ్రామంలో పోడు భూములపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని రైతులకు పోడు భూములపై అవగాహన కల్పించారు. పోడు భూ ముల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, అటవీ భూములను రైతులు ఎంత కాలం నుంచి ఎంత విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నారో తెలియజేయాలని సూచించారు. మంగళవారం నుంచి దరఖాస్తు లు స్వీకరిస్తామని తెలిపారు. సర్పంచ్ మహేం దర్, రైతు లు పాల్గొన్నారు. మండలంలోని బొంరాస్‌పేట, తుంకిమెట్ల, మదన్‌పల్లి, దుద్యాల, రేగడిమైలారం గ్రామాల్లో పోడు భూముల సమస్యపై అధికారులు గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. ఎంపీవో పాండు, ఆర్ఐలు రవికుమార్, రవినాయక్ పాల్గొన్నారు.
హక్కును కల్పించే దిశగా..
కొడంగల్, నవంబర్ 8: పోడు భూముల్లో సాగు చేసు కుంటున్న రైతులకు ప్రభుత్వం హక్కును కల్పించే దిశగా గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ రవీందర్, ఎంపీ డీవో మోహన్‌లాల్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని అప్పాయిపల్లి, పోచమ్మతండా, భవనమ్మతండా, బోయపల్లితండా, టేకల్‌కోడ్ గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లా డుతూ 2005 సంవత్సరానికి ముందు నుంచి ఫారెస్టు భూ ము ల్లో సాగు చేసుకొంటున్న రైతులకు హక్కులను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్ర త్యేకం గా గ్రామ సభలను ఏర్పాటు చేసి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు అధికారి ఎఫ్ఆర్వో సవిత, ఎంపీవో శ్రీనివాస్‌లతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు గీతాఠాకూర్, శంకర్‌నాయక్, గుండప్పలతో పాటు పోడు రైతులు పాల్గొన్నారు.
కులకచర్ల మండల పరిధిలో..
కులకచర్ల, నవంబర్ 8: కులకచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మండల అధికారులు సోమవారం పోడు భూములపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామాల్లో అటవీభూములను సాగుచేస్తున్న రైతుల వివరాలను తెలుసుకొని పోడుభూములకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. రైతులు పోడు భూము లకు సంబంధించిన వివరాలను దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్‌రావు, ఆర్ఐ రవికిషోర్, ఎంపీవో సుందర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి నివేదిక పంపుతాం
బంట్వారం, నవెంబర్8 : పోడు రైతులు విధిగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో బాలయ్య పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని రొంపల్లి, నాగ్వారం గ్రామాల్లో పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ కోసం రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అనధికారికంగా సాగు చేస్తున్న రైతులు తమ భూమి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతుల భూములను రెవెన్యూ అధికారులు సందర్శించి వివరాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదిక పంపుతారన్నారు. దీంతో ప్రభుత్వం సదరు రైతులకు న్యాయం చేస్తుందన్నారు. కనిష్టంగా 15 నుంచి 20 ఏండ్లుగా సాగు చేస్తున్న రైతులు తమ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఆర్ఐలు పాల్గొన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
పెద్దేముల్, నవంబర్ 8 : అటవీ శాఖ భూములను సాగు చేస్తున్న రైతులు పోడు భూముల సమస్యలపై, హక్కుల పత్రాలను పొందడానికి దళారులను నమ్మి మోస పోవద్ద ని పెద్దేముల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజురెడ్డి ఎంపీడీవో లక్ష్మప్ప అన్నారు. సోమవారం మండల పరిధిలోని తట్టేపల్లి, పాషాపూర్, జయరాంతాండ(ఐ) గ్రామాల్లో అవగాహన కల్పించి, దరఖాస్తులను పత్రాల న మూనాను అర్హులైన రైతులకు అందించారు. కార్యక్రమంలో ఆయా గ్రా మాల సర్పంచులు రామమ్మ, భరత్‌కుమా ర్, సేవ్లీబాయి, గిరిజనశాఖ అధికారి పుల్లారెడ్డి, అటవీశాఖ అధికారి మమ త, తట్టేపల్లి ఎంపీటీసీ శంకర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు శ్రావణ్, కార్తీక్, స్నేహలత,ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
మర్పల్లి మండలంలో…
మర్పల్లి, నవంబర్ 8: మండలంలోని కల్కూడా, షాపూర్ తండా, దామస్తాపూర్ గ్రామాల్లో పోడు భూముల సమ స్యల పరిష్కారం కోసం గ్రామ సభ నిర్వహించి కమిటీలు వేశారు. కార్యమంలో తహసీల్దార్ తులసీ రామ్, ఎం పీడీవో వెంకట్రాంగౌడ్,సర్పంచులు శివకుమార్, సాలి బా యి, జైపాల్‌రెడ్డి,ఆర్ఐ కరుణాకర్,ఎంపీవో సోమలింగం పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.