
అల్లాదుర్గం, నవంబర్ 8: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రజినీకాంత్ తెలిపారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో అల్లాదుర్గం, ముస్తాపూర్, రెడ్డిపల్లి, ఐకేపీ ఆధ్వర్యంలో గడిపెద్దాపూర్, ము ప్పారం, అప్పాజిపల్లి, రాంపూర్ గ్రామాల్లో కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రజనీకాంత్, టెలి కాం అడ్వైజర్ కాశీనా థ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్, సర్పంచ్‌లు అంజి యాదవ్, శివరాం, రంజిత్, దశరత్ ఉన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
రామాయంపేట రూరల్, నవంబర్ 8: రామాయంపేట మండలం ఝూన్సీలింగాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు దాన్యం అమ్ముకోవడానికి ఈ కేంద్రాలు ఎంతో సౌకర్యంగా ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, ఉపసర్పంచ్ సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ జ్యోతి, మాజీ సర్పంచ్ రామకిష్టయ్య, చాకలి పోచయ్య పాల్గొన్నారు.
టేక్మాల్‌లో..
టేక్మాల్, నవంబర్ 8: రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కో ఆప్షన్ సభ్యుడు యూసుఫ్ తెలిపారు. మండల పరిధిలోని చంద్రుతండాలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కోరంపల్లి ల్లో కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచ్‌లు ప్రారం భించారు.కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి, ఏవో రాంప్రసాద్, సర్పంచ్‌లు స్రవంతి సర్ధార్, శ్రీనివాస్, టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి అవినాశ్ ఉన్నారు.