ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
‘శ్రీపాండురంగ భజన కీర్తనలు’ పుస్తకావిష్కరణ
కరోనాపై మరింత అప్రమత్తంగా ఉండాలి
డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్
బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన
షాద్‌నగర్‌టౌన్, జనవరి 8 : రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న కరోనాపై అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్ సూచించారు. ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజాలో శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టోల్‌ప్లాజా మేనేజర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ప్లాజాలోని ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 113 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. షాద్‌నగర్ డివిజన్లో 387 రాపిడ్ పరీక్షలు నిర్వహించగా షాద్‌నగర్‌కు చెందిన ఐదుగురు, కొత్తూరులో ఒకరికి వచ్చినట్లు తెలిపారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఎప్పుటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ నరహరి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది వెంకటముని, రెడ్డినాయక్, రమేశ్, స్వప్న, టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ ఇబ్రహీం పాల్గొన్నారు.