మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కృపేశ్
ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 7 : రైతుబంధు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షుడు కృపేశ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవన, వైద్యం, శిశుసంక్షేమం, విద్య, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, ఐకేపీ, రెవెన్యూ, ఆర్టీసీ, ఎక్సైజ్‌శాఖ, ఉపాధిహామీ, పంచాయతీరాజ్‌తో పాటు పలు శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఎంపీపీ కృపేశ్ మాట్లాడుతూ.. రైతుబంధు సంబురాలు మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలన్నారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యారోగ్యశాఖ అధికారి అభిరాం అన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్‌లు హంసమ్మ, ఆండాళు, అరుణమ్మ, గీతా, ఎంపీటీసీలు మంగ, నాగమణి, సహకార సంఘం చైర్మన్ బిట్ల వెంకట్‌రెడ్డి సభలో విద్యుత్‌శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఏఈ శ్రీనివాస్‌రావు తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు కృషిచేస్తున్నామని ఎంఈవో వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఎలిమినేడు పశువైద్యశాలకు వైద్యాధికారిని నియమించాలని సర్పంచ్‌లు సభా దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, వెంటనే ఎలిమినేడు వైద్యాధికారిని కేటాయించే విధంగా కృషిచేయనున్నట్లు ఎంపీపీ తెలిపారు. గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నందున వీటిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు ఆండాళు, గీతారాంరెడ్డి, యాదగిరి సభాదృష్టికి తీసుకువచ్చారు. బెల్టుషాపులపై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నామని, ఇంకా ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఎస్సై తెలిపారు. ప్రభుత్వం ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు సబ్సిడీపై మిరప, టమాట, వంకాయ నారుతో పాటు డ్రిప్, స్పింక్లర్లు, పందిరిసాగు, నెట్హౌజ్లు సబ్సిడీపై అందజేస్తున్నట్లు ఉద్యానవన అధికారి కనకలక్ష్మి సభలో తెలిపారు.
అక్రమ వెంచర్లను ఉపేక్షించేది లేదు
అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకుంటామని ఎంపీపీ కృపేశ్ అన్నారు. పోల్కంపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ ఏర్పాటుచేసి, ప్రభుత్వ భూమిని కబ్జాచేయటంతో పాటు తమపై, తమ భర్తపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఆ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోల్కంపల్లి సర్పంచ్ ఆండాళుగిరి సభలో మండిపడ్డారు. దీనిపై స్పందించిన ఎంపీపీ కృపేశ్ అక్రమంగా వెంచర్లు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ అనుమతులు, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా వెంచర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ వెంకటప్రతాప్‌రెడ్డి, ఎంపీడీవో మహేష్‌బాబు, తాసిల్దార్ అనిత, ఏవో వరప్రసాద్‌రెడ్డి, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్లు రాజశేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఏపీడీ సత్యనాయక్, పంచాయతీరాజ్ఏఈ ఇంద్రసేనారెడ్డి, పశు సంవర్ధకశాఖ అధికారి సురేందర్, ఏపీఎం రవీందర్, ఏపీవో లలిత, వైద్యారోగ్యశాఖ అధికారి అబిరాంతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.