వికారాబాద్, జనవరి 7: పోలీస్స్టేషన్లలో పోలీస్ అధికారులు, ఫిర్యాదుదారులు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వికారాబాద్ పట్టణంలో కొత్త గా నిర్మించిన పోలీస్‌స్టేషన్, పోలీస్ సిబ్బంది కోసం నిర్మిస్తున్న పోలీస్ కల్యా ణ మండపం, పోలీస్ స్థలాలను పరిశీలించారు. అనంతరం మహిళా పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంత రం మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పోలీస్ హౌసింగ్ బోర్డు పనులు త్వ రగా పూర్తి చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లోని అధికారులు, సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించి అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. రిసెప్షనిస్టు ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి, స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడే అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రషీద్, వికారాబాద్ ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాజశేఖర్, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ప్రమీల, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి
నవాబుపేట, జనవరి 7: పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నవాబుపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం నవాబుపేట ఎస్ఐ, సిబ్బందితో మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని, ప్రజలకు సైబర్ నేరాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఏఆర్ డీఏస్పీ సత్యనారాయణ, మోమిన్‌పేట సీఐ వెంకటేశం, నవాబుపేట ఎస్ఐ విశ్వజన్, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.