
సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
మియాపూర్, జనవరి 7 : ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న సమాంతర రహదారులకు విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ మెట్రో సమీపంలో నూతనంగా నిర్మించిన సమాంతర దారిలో రూ. 11 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి విప్ అరెకపూడి గాంధీ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రి సమయాలలో వాహనదారులు, పాదచారులకు ఈ విద్యుత్ వెలుగుసు సౌకర్యంగా ఉంటాయన్నారు. సెంట్రల్ లైటింగ్‌తో కనెక్టింగ్ రోడ్డు నూతన శోభను సంతరించుకుందన్నారు. డివిజన్ అభివృద్ధికి తన పూర్తి తోడ్పాటును అందిస్తానని ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ మృదుల, సుధాకర్, పార్టీ నేతలు దామోదర్‌రెడ్డి, పోతుల రాజేందర్, ప్రసాద్, శ్రీనివాస్, వేదమూర్తి, వెంకటేశ్ యాదవ్, భూపాల్, శ్రీకాంత్, సత్యనారాయణ, అష్రాఫ్, ఖదీర్, సదాబాలయ్య, కుమార్‌స్వామి, శ్రీనివాస్, శ్రీహర్ష, అప్పిరెడ్డి, రాజు, నర్సింగరావు, కృష్ణ, సత్తార్, యాసిన్, పప్పు, సుధాకర్, కృష్ణకుమారి, మాధవి, పద్మ తదితరులు పాల్గొన్నారు.