
‘
దేవరకద్ర రూరల్, నవంబర్ 5 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలకు మహర్దశ వచ్చిందని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. దేవరకద్ర మండలం జీన్గురాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా పల్లెప్రకృతి వనం, ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.50లక్షలతో నిర్మించిన 8 అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన 68మం ది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.68,07, 888 విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపా రు. పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలన్నీ సుందరంగా మారాయన్నారు. హరితహారం మొక్కలతో పచ్చదనం పెరిగిందన్నారు. అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి పథకంతో రూ.లక్షా 116 అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొండా సుగుణ, సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ తిరుపతయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
భూత్పూర్, నవంబర్ 5 : సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్నాసాగర్‌లో కప్పెటకు చెందిన గోపాల్‌కు రూ.10,500 సీఎం సహాయనిధి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మూసాపేట, నవంబర్ 5 : మండలంలోని జానంపేటలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, తాసిల్దార్ మంజుల, ఎంపీడీవో ఉమాదేవి, ఏవో రాజేందర్‌రెడ్డి, సీఈవో భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు. అలాగే పొల్కంపల్లిలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.