
బాలానగర్, నవంబర్ 5 : ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టి న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు అండ గా మారాయి. అర్హులైన కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తుండడంతో పెండ్లిళ్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వత 2014లో రూ.51 వేలు అందించగా, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో 2017లో రూ.7 5.116 ఇచ్చారు. 2018లో లక్షా116కు పెంచారు. నేటి సమాజంలో ఆడబిడ్డ పుట్టిందంటే అప్పులు చేసి పెండ్లిళ్లు ఎలాచే యాలోనని ఇబ్బందులు పడే తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ ఒక మేనమామగా పెండ్లి కానుక కింద రూ.లక్షా11 6 అందించి కుటుంబాలను ఆదుకోవడంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 2017-20 21 వరకు మొత్తం 836 దరఖాస్తులు వచ్చాయి. లబ్ధిదారుల దరఖాస్తులు తాసిల్దార్, ఎమ్మెల్యే కార్యాలయాల్లో పరిశీలనలో ఉ న్నట్లు, త్వరలో వారికి కూడా ఆర్థికసాయం అందజేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పెండ్లి చేసిన వెంటనే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు జత చేసి మీ సేవ లో దరఖాస్తులు చేసి రెవెన్యూ కార్యాలయంలో అందజేస్తున్నారు. అక్కడి నుం చి పై అధికారులు పరిశీలిం చిన తర్వాత లబ్ధిదారులకు ఆర్థికసాయం మంజూరు చేస్తున్నారు.
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
మండలంలోని లబ్ధిదారులకు చెక్కుల ను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందజేయనున్నారు. శనివారం మండల ప్రజా పరిష త్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేయనున్నారు.
సర్కార్కు రుణపడి ఉంటా…
నా కూతురు పెండ్లికి ప్రభుత్వం ఆర్థిక సా యం అందించింది. అప్పు చేసి పెండ్లి ఎలా ఇబ్బందులు పడే సమయంలో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకంతో రూ.లక్షా116 అందించారు. మా కుటుంబానికి అండగా నిలిచారు. పెండ్లిళికు పైస లు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. కల్యాణలక్ష్మి వచ్చిన పైసలతో పెండ్లికి చేసిన అప్పులు కట్టాం. ఈ ప్రభుత్వానికి ఎప్పటికి రుణపడి ఉంటాము.
-బుయ్యకారి బారతమ్మ, ఉడిత్యాల