
మలక్‌పేట, డిసెంబర్ 3 : ప్రతిభావంతులైన దివ్యాంగులను ప్రోత్సహిస్తున్నామని మలక్‌పేట డీసీ రజినీకాంత్‌రెడ్డి తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ దినం సందర్భంగా సంతోష్‌నగర్ డీపీఓ రత్నమ్మ, సీఓలు యాదయ్య, రవికుమార్, రామకృష్ణ, వీఆర్పీ నర్సింహల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతిభావంతులైన దివ్యాంగులను సన్మానించారు. నలుగురు దివ్యాంగులకు గ్రూప్‌లోన్ కింద రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో యూసీడీ అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.
వైకల్యం అడ్డుకాదు..
చాదర్‌ఘాట్, డిసెంబర్ 3 : మనిషి ఎదుగుదలకు వైకల్యం అడ్డుకాదని.. స్వయం కృషితో వైకల్యాన్ని అధిగమించి అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చునని ఏక్తా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్ యాదవ్ అన్నారు. శుక్రవారం దివ్యాంగుల సంక్షేమ దినం సందర్భంగా మలక్‌పేటలో పంచర్ షాపును నిర్వహిస్తున్న ఎస్. రాజు దివ్యాంగున్ని ఏక్తా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో గాంధీ నగర్ డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సాయి, తరుణ్, సురేశ్ పాల్గొన్నారు.