
పేదల కోసమే బస్తీ దవాఖానల ఏర్పాటు
ఆరోగ్య తెలంగాణ ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యం
బస్తీ దవాఖానల ప్రారంభోత్సవంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు , ఎమ్మెల్యే
బాలానగర్, డిసెంబర్ 3 :మెరుగైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించడం కోసమే బస్తీ దవాఖానలకు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధి శాంతినికేతన్కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ప్రారంభ కార్యక్రమానికి మంత్రితో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య తెంలగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. బస్తీ దవాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగరవ్యాప్తంగా 258 బస్తీ దవాఖానలు ఉండగా అదనంగా మరో 92 ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. శుక్రవారం ఒక్కరోజే 32 బస్తీ దవాఖానలు ప్రారంభించినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
త్వరలో మరిన్ని ఏర్పాటు ..
అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యాన్ని అందించడం కోసం బస్తీ దవాఖానలు విస్తరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో మరిన్ని బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. స్థానికంగా బస్తీవాసులకు సత్వర వైద్యసేవలు అందించడం కోసం బస్తీ దవాఖానలు ఎంతో ఉపయోగపడుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారిణి వాకటి కరుణ, మేడ్చల్ కలెక్టర్ నరేశ్, కూకటపల్లి జడ్సీ మమత, డీసీ రవీందర్‌కుమార్, ఏఎంహెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి, బాలానగర్ మండల వైద్యాధికారి డాక్టర్ చందర్, ఏఈ అరవింద్‌రావు, టీఆర్ఎస్ నాయకులు నరేందర్‌గౌడ్, కర్రె జంగయ్య, మాజీ కౌన్సిలర్లు కర్రె లావణ్య, మక్కల నర్సింగ్, నియోజకవర్గం మైనార్టీ నేత సయ్యద్ ఎజాజ్, నాయకులు బల్వంత్‌రెడ్డి, హరినాథ్, లలిత, సరోజ, రాజుగౌడ్‌లతో పాటు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.