
కౌడిపల్లి, నవంబర్ 3 : రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి, వెంకట్రావ్‌పేట్, ముట్రాజ్‌పల్లి, వెంకటాపూర్(ఆర్), తిమ్మాపూర్, రాయిలాపూర్, నాగ్సాన్పల్లి, మహ్మద్‌నగర్, పాంపల్లి, ధర్మసాగర్, కంచన్‌పల్లి, కొట్టాల, వెల్మకన్నె, కౌడిపల్లి గ్రామాల్లో ఐకేపీపీ, మహ్మద్‌నగర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లేబర్ బోర్డ్ చైర్పర్సన్ ఉమ్మన్నగారి దేవేందర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీబీసీ డైరెక్టర్ బాన్సువాడ గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ రాజు, జడ్పీటీసీ కవిత, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రామాగౌడ్, రైతు సమన్వయ జిల్లా కమిటీ సభ్యులు శివాంజనేయులు, ఆత్మకమిటీ చైర్మన్ మల్లారెడ్డి, మహ్మద్‌నగర్ సొసైటీ వైస్ చైర్మన్ చిలుముల చిన్నంరెడ్డి, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు చంద్రం క్రిష్ణాగౌడ్, సర్పంచ్‌లు ఎంపీటీసీలు, ఏడీఏ బాబూనాయక్, తహసీల్దార్ రాణాప్రతాప్, ఏవో పద్మావతి, ఎంపీడీవో భారతి, రైతులు పాల్గొన్నారు.
41 కిలోల తూకంతోనే
బస్తా ధాన్యం విక్రయించాలి
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 3 : బస్తా బరువుతో కలిపి 41 కిలోల తూకంతో మాత్రమే ధాన్యం విక్రయించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు తాడెపు సోములు రైతులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 41 కిలోలతో బస్తా తూకం పెట్టినా క్వింటాల్‌కు ఒక కిలో రైతు నష్టపోతున్నాడన్నారు. రైస్ మిల్లర్ల యజమానులు 42 కిలోలు ఉంటేనే తీసుకుంటామని చెబుతున్నారని, దీంతో 42 కిలోలతో బస్తా తూకం పెడితే క్వింటాల్‌కు మూడున్నర కిలోలు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతులు నష్టపోకుండా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ధాన్యం విక్రయించే సమయంలో ఎవరికైనా సమస్యలు ఎదురైతే రైతుబంధు సమితి మండల అధ్యక్షులను సంప్రదించాలని సూచించారు.