మొదటి రోజు 15-18 ఏళ్ల వయసున్న 236 మందికి టీకాలు
ఎంజీఎం, సీకేఎంతోపాటు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్
28 రోజుల తర్వాత రెండో డోసు వేయించుకోవాలి
జిల్లా వైద్యాధికారి వెంకటరమణ
వరంగల్ చౌరస్తా/పోచమ్మ మైదాన్, జనవరి3:కరోనా వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం 15 నుంచి 18 ఏళ్ల వారికి కూడా టీకాలు వేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ వయసు పిల్లలు 45,048 మంది ఉన్నట్లు జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. వీరికి సోమవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 236 మందికి వ్యాక్సిన్ వేశారు. ఎంజీఎం, సీకేఎం దవాఖానలతోపాటు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారు 28 రోజుల తర్వాత రెండోది తీసుకోవాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ తెలిపారు.
ప్ర భుత్వం 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మొదటి రోజు జిల్లావ్యాప్తంగా 236 మంది పిల్లలు మొదటి డోసు టీకా తీసుకున్నారని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే వెంకటరమణ తెలిపారు. వరంగల్ దేశాయి పేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో టీకా కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి టీకా వేయించుకున్న బాలికను అభినందిస్తూ పు ష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకా రం నిబంధనలను పాటిస్తూ, అన్ని ఆరోగ్య కేంద్రాలతో పాటుగా వరంగల్ సీకేఎం, ఎంజీఎం హాస్పిటల్స్‌లో సైతం వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొ న్నారు. అన్ని కేంద్రాల్లో కొవాగ్జిన్ టీకాను అందుబా టులో ఉంచామని ఆయన తెలిపారు. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారు వ్యాక్సిన్ వేసుకో వడానికి ముందుకు రావాలని కోరారు. 2007 సంవ త్సరం, అంతకన్నా ముందు జన్మించిన కిశోర బాలిబా లికలకు ప్రత్యేకంగా కొవిడ్ టీకాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని ముందస్తుగా ఆన్లైన్ ద్వారా, టీకా కేంద్రా ల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లకు పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ దవాఖానల్లో కొవాగ్జిన్ టీకా కోసం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, వ్యాక్సినేషన్ ఇస్తు న్నామని, 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారని ఆయన వివరించారు. బాధ్యతతో మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుని తమ పిల్లలకు కొవాగ్జిన్ టీకా వే యించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కా ర్పొరేటర్ కావటి కవిత, డీఐవో డాక్టర్ ప్రకాశ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్‌కుమార్, డాక్టర్ రవీందర్, డిప్యూ టీ డెమో అనిల్‌కుమార్, మధుసూదన్, సిబ్బంది జ్యోతి, సరస్వతి, జన్ను కొర్నేలు, అనిల్, కాల్వల కు మార్, ఫార్మసీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎంజీఎంలో పిల్లలకు వ్యాక్సినేషన్ కేంద్రం
ఎంజీఎం దవాఖానలో పిల్లల వ్యాక్సినేషన్ కేంద్రా న్ని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలో పిల్లలకు సైతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఓపీ విభాగంలో ఈ కేంద్రాన్ని ఏ ర్పాటు చేశామని అన్నారు. 15 నుంచి 18 సంవత్స రాల వయసు కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియో గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ మురళి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.