కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి గ్రామస్తుల
గోడలపై విజ్ఞానాన్ని పెంచేలా పెయింటింగ్‌లు
ఆవరణలో ఆకట్టుకుంటున్న పచ్చదనం
హయత్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 1: అది అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాల. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు రెండూ ఒకే ఆవరణలో ఉన్నాయి. బడి ఆవరణలోకి అడుగుపెట్టింది మొదలు.. తరగతి గదు ల వరకు అక్కడ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. తరగతి గదుల గోడలపై గీసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయ బృం దం చొరవ, స్కూల్ యాజమాన్య కమిటీలు, గ్రామస్తులు, దాతల సహకారం తో విద్యార్థులకు వినూత్నంగా విజ్ఞానం అందుతున్నది. పాఠశాల యాజమాన్య కమిటీకి గతంలో చైర్మన్‌గా పనిచేసిన కొత్తకంటి శ్రీనివాస్ బడిలో వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించారు. అం దులో భాగంగానే బడిలో బొమ్మ వేయి స్తే.. దానికిందే రాయించిన దాత పేరు కూడా ఏర్పాటు చేయించే వెసులుబాటు కల్పించారు. ఫలితంగా ఒకరిని చూసి మరొకరు విద్యార్థులకు విజ్ఞానాన్ని పం చే బొమ్మలను వేయించేందుకు ముందుకొచ్చారు. ఓ దాత విద్యార్థులకు అవసరమైన నీటి ట్యాంకు నిర్మించి ఇవ్వగా.. మరొకరు సీసీ కెమెరాలను ఏర్పాటుచేయించారు. తాను కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే రూ. 8 లక్షలకు పైచిలుకు నిధులతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టినట్టు శ్రీనివాస్ తెలిపారు. గ్రామస్తులు, దాతల సహకారంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు జైత్రంనాయక్ పేర్కొన్నారు.
విజ్ఞానం వెల్లివిరిసేలా..
తరగతి గోడలపై జాతీయ చిహ్నాలతో బొమ్మలు గీయించారు.
భారతదేశ చిత్రపటం, సరస్వతీదే వి, తెలంగాణ తల్లి, సావిత్రి జ్యోతిరావు ఫూలే బొమ్మలు వేయించారు.
విజ్ఞానాన్ని పంచేలా మూత్రపిండా లు, మెదడు, గుండె, మానవ శరీర నిర్మాణ చిత్రాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, ప్రతి బొమ్మలోని చిన్న అంశా న్ని కూడా వదలకుండా పేర్లు ప్రస్తావిస్తూ విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతున్నాయి.దేశానికి ఇప్పటివరకు రాష్ట్రపతు లు, ప్రధానమంత్రులుగా ఎంతమంది పనిచేశారు, ఏ సమయంలో ఎవరు ఉన్నారు, ఎంతకాలం ఉన్నారు, వారి పేర్లు.. ఇలా అన్ని వివరాలతో కూడిన పెయింటింగ్‌లు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి.
పెద్దల పేరుతో బడికి షెడ్డు
మా మామయ్య, అత్తమ్మ ముద్దం యాదయ్య, అంజమ్మ పేరుతో పాఠశాలలో రూ.80 వేలతో షెడ్డు వేయించాం. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. గ్రామంలోని పలువురు దాతలు కూడా తోచినంత సాయం చేస్తున్నారు. గ్రామస్తులు, పాఠశాల యాజమాన్య కమిటీతో కలిసి పాఠశాలలో పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టిపెట్టాం. విద్యార్థులకు ఉత్తమ విద్య అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.