e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home జిల్లాలు సీఎం కేసీఆర్‌తోనే ఆలయాల అభివృద్ధి

సీఎం కేసీఆర్‌తోనే ఆలయాల అభివృద్ధి

గజ్వేల్‌అర్బన్‌, మార్చి 15: సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం లో ఆలయాల అభివృద్ధి జరుగుతున్నదని ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. సోమవారం వర్గల్‌ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ ప్రసంగించారు. 450ఏండ్ల క్రితం కృష్ణదేవరాయలు తిరుపతిని, అలాగే భద్రాచలాన్ని రామదాసు నిర్మించిన రీతిలో సీఎం కేసీఆర్‌ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అత్యద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. అదే తరహాలో నాచగిరి ఆలయ అభివృద్ధికి త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు సూచించారన్నారు. ఇప్పటికే రూ. 8కోట్ల అంచనా వ్యయంతో నాచగిరి వద్ద హల్దీవాగు చెక్‌డ్యాం, పుష్కరఘాట్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నాచగిరి అభివృద్ధిలో భాగంగా 20ఎకరాల్లో అర్బన్‌పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ, కాటేజీలను అద్భుతంగా తీర్చిదిద్ది నాచగిరికి కొత్తరూపును సంతరించుకునేలా సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నారన్నారు. భక్తులంతా మళ్లీమళ్లీ నాచగిరి దర్శించుకోవాలన్న భావనను ధృడంగా కలిగేలా తీర్చిదిద్దుతామన్నారు. నూతన పాలకవర్గం, చైర్మన్‌ హన్మంతరావు నాచగిరిని మరింత అభివృద్ధి చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.

పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు
నాచగిరి లక్ష్మీనృసింహస్వామి దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆర్థిక మంత్రి తన్నీ రు హరీశ్‌రావు హాజరు కాగా ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీనృసింహస్వామికి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన పాలకవర్గంతో దేవాదాయశాఖ అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ నాగరాజు, ఆకుల భాగ్యలక్ష్మి, నంగునూరి సత్యనారాయణ, చంద్రారెడ్డి, వెంకటస్వామి, చింత శ్రీనివాస్‌, పడిగె రాజు, మామిడి నరేశ్‌, రాచమల్ల నాగేశ్వర్‌రావు, భీమప్ప ధర్మకర్తల మండలి సభ్యులుగా, సభ్యుడిగా కృష్ణమాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మాజీ ఫుడ్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, నాయకులు యాదవరెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ శ్రీనివాస్‌, ఎంపీపీలు లతా రమేశ్‌గౌడ్‌ పాల్గొ న్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement