యాదాద్రి, జనవరి 8 : రైతుబంధు వారోత్సవాలు మురిపెంగా కొనసాగుతున్నాయి. శనివారం ఐదో రోజు జరిగిన వేడుకల్లో ఊరూరా రైతులతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పెట్టుబడి కష్టాలు తీర్చుతున్న ప్రభుత్వాన్ని రైతులు కొనియాడారు. వాడవాడనా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. పెట్టుబడి కష్టాలు తీర్చిన సర్కారుకు మనసారా కృతజ్ఞతలు చెప్పారు. యాదగిరిగుట్ట మండలంలోని మైలారిగూడెంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఆలేరు పట్టణంలో పీఏసీఎస్ కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్‌గౌడ్ రైతులను సన్మానించారు.
రాజాపేట మండలంలో..
రాజాపేట : రేణికుంటలో నారుమళ్లల్లో రైతుబంధు, కేసీఆర్ అక్షరాలు కూర్పు చేశారు. రాజాపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. బేగంపేటలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చిత్రపటాలకు జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, సర్పంచులు బూర్గు భాగ్మమ్మానర్సిరెడ్డి, గాడిపల్లి శ్రవణ్‌కుమార్, సీసీ బ్యాంక్ చైర్మన్ చింతలపూరి భాస్కర్‌రెడ్డి, వైస్ చైర్మన్ కాకల్ల ఉపేందర్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్‌గౌడ్, యువజన అధ్యక్షుడు పల్లె సంతోష్‌గౌడ్, కోశాధికారి కటకం స్వామి, ప్రధాన కార్యదర్శి రేగు సిద్ధులు, మాజీ సర్పంచ్ రామిండ్ల నరేందర్, నాయకులు నక్కిర్త కనకరాజు, కొండం రాజు పాల్గొన్నారు. బేగంపేట హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇండ్ల అభినవ్ పాఠశాలలో నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో పాల్గొని తన కుటుంబానికి రూ.25 వేలు వచ్చాయని డ్రాయింగ్ ద్వారా తెలియజెప్పాడు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తన తండ్రి రైతుబంధు సాయం తీసుకుంటున్నట్లు, దాంతో చేనుచెలక పచ్చగా మారినట్లు వేసిన డ్రాయింగ్ ఆకట్టుకుంది. విద్యార్థిని టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు సంతోష్‌గౌడ్ అభినందించి ప్రథమ బహుమతి అందజేశారు.
ఆలేరు మండలంలో..
ఆలేరు రూరల్ : అన్ని గ్రామాల్లో సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. పొలాల్లో రైతుబంధు, కేసీఆర్ అక్షరాలను వరి నారుతో పేర్చారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బక్క రాంప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, సర్పంచులు వంగాల శ్రీశైలం, కోటగిరి జయమ్మ, కోటగిరి పాండరి, కేతావత్ సుజాత, బండ పద్మ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు, రైతులు పాల్గొన్నారు.
తుర్కపల్లి మండలంలో..
తుర్కపల్లి : దత్తాయిపల్లి పాఠశాలలో ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, ఏఓ దుర్గేశ్వరి విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కొండాపురంలో నాయకులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దయ్యంబండతండాలో రైతుబంధును హర్షిస్తూ సంబురాలు జరిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్‌కుమార్, జహంగీర్, వెంకటేశ్, దయ్యంబండతండా సర్పంచ్ లలితాశ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ ముత్యాలు పాల్గొన్నారు.
బొమ్మలరామారం మండలంలో..
బొమ్మలరామారం : జలాల్పూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొలగాని వెంకటేశ్‌గౌడ్, గుమ్మడి మహేందర్ రెడ్డి, జూపల్లి భరత్, మడిగె నర్సింహ, నాగరాజు పాల్గొన్నారు.
బొమ్మాయిపల్లిలో..
భువనగిరి అర్బన్ : పట్టణ పరిధిలోని బొమ్మాయిపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు మాట్లాడుతూ గతంలో అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతుకు నేడు సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. విజేతలకు మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యతో కలిసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్, వార్డు కౌన్సిలర్ జిట్ట వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అబ్బగాని వెంకట్‌గౌడ్, ఇట్టబోయిన గోపాల్, నిలుగొండ శివశంకర్ పాల్గొన్నారు.
బీబీనగర్ : బ్రాహ్మణపల్లి, పల్లెగూడెంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సుధాకర్‌రెడ్డి, బాలరాజు, వ్యవసాయ శాఖ అధికారులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.
చౌటుప్పల్‌లోని 3వ వార్డులో..
చౌటుప్పల్ రూరల్ : మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి గుండెబోయిన వెంకటేశంయాదవ్, వార్డు అధ్యక్షుడు వల్లందాసు సతీశ్, నాయకులు ఊదరి నర్సింహ, ఎర్రగోని నర్సింహ, రామనగోని రఘు పాల్గొన్నారు.
బాచుప్పలలో..
రామన్నపేట : మండలంలోని బాచుప్పలలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జోగు సత్యనారాయణ, బాచుప్పల ఎల్లయ్య, బొబ్బల మల్లయ్య, గోరయ్య, నర్సింహ, మల్లయ్య, యాదయ్య అంగన్వాడీ టీచర్ నాగమణి, ఆశ కార్యకర్త శైలజ పాల్గొన్నారు.
మోత్కూర్ మండలంలో..
మోత్కూర్ : పనకబండలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. గ్రామంలోని రైతులను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ బత్తిని తిరుమలేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు లోతుకుంట స్వామి, పీఏసీఎస్ డైరెక్టర్ ముత్యాలు, వార్డు సభ్యురాలు నాగమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.
గుండాల మండలంలో..
గుండాల : రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో రైతులను సన్మానించారు.వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఖలీల్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దార సైదులు, సర్పంచ్ రేఖ, నాయకులు కోలుకొండ రాములు, వెంకటేశ్, యాదగిరి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) మండలంలో..
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంతోపాటు రాఘవాపురం, తుక్కాపురం, తిమ్మాపురం గ్రామాల్లో మహిళలు ముగ్గులు వేశారు. సర్పంచులు దొండ కమలమ్మ, కొమురెల్లి రాంరెడ్డి, దయ్యాల రాజు, ఏఓ శిల్ప, టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు సోలిపురం అరుణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురం మండలంలో..
సంస్థాన్ నారాయణపురం : ధాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వావిళ్లపల్లి రైతు వేదిక వద్ద రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. గ్రామసభ నిర్వహించి రైతుబంధు, రైతు బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఓ ఉమారాణి, ఏఈఓలు లక్ష్మణ్, విజయ్‌కుమార్ రైతులు, మహిళలు పాల్గొన్నారు.
వలిగొండ మండలం మొగిలిపాకలో..
వలిగొండ : మండలంలోని మొగిలిపాకలో సర్పంచ్ ముద్దసాని శశికళ, మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను సన్మానించారు. ఉప సర్పంచ్ నర్సింహ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ జడిగ భిక్షపతి, సురేందర్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.