
సంగారెడ్డి మున్సిపాలిటీ, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో భాగంగా టీఎన్జీవోస్ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక టీఎన్జీవోస్ భవన్లో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు టి.సుశీల్‌బాబు మా ట్లాడుతూ తొలిదశ ఉద్యమంలో తెలంగాణ జెండా ఎత్తి మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి యం.నర్సింహులు, రాష్ట్ర కార్యదర్శి వి.రవి, కార్యవర్గ సభ్యులు యన్.శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, కోశాధికారి కె.శ్రీకాంత్, మహిళా ఉపాధ్యక్షురాలు ఆర్.నిర్మల రాజకుమారి, టీహెచ్డబ్ల్యూవో రాష్ట్ర అధ్యక్షుడు గౌస్ హష్మి, పట్టణ శాఖ అధ్యక్షుడు జి.శ్రీనివాస్, కార్యదర్శి డి.భాస్కర్ పాల్గొన్నారు.
ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో…
ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ అతిథి గృహం అమరవీరుల స్తూపం వద్ద జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, ఉపాధ్యక్షుడు సజ్జద్ఖాన్, ప్రధాన కార్యదర్శి ఆదిపురం మహేశ్‌కుమార్, మైనార్టీ నాయకులు బాబా హష్మి, సభ్యులు సాయి వరాల పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 6: జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సం ఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతిని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ చురుగ్గా పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ వెంకటేశం, డాక్టర్ ఉపేందర్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అధికారులు మనోజ్‌కుమార్, జగదీశ్వర్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.
సంగారెడ్డిలోని ఎస్టీయూ భవన్లో జయశంకర్ సార్ జ యంతిని నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేశ్ కుమార్, సయ్యద్ సాబేర్ అలీ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆర్సీపురం డివిజన్లో…
రామచంద్రాపురం,ఆగస్టు 6ః జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆర్సీపురం డివిజన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద, భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్లు పుష్పానగేశ్, సింధూఆదర్శ్రెడ్డిలు వేర్వేరుగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్‌నగర్‌లో ఉన్న జయశంకర్ సార్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలాజీ, లచ్చిరాం, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల అధ్యక్షులు పరమేశ్, దేవేంద్రచారి, నాయకులు కుమార్‌గౌడ్, మోహన్‌రెడ్డి, నర్సింహ్మ, ఐలేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బంగారు తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి
గుమ్మడిదల, ఆగస్టు6: బంగారు తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత ఉద్యమకారుడు ప్రొ. జయశంకర్ సార్ అని జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో, బొంతపల్లి, గుమ్మడిదల, కానుకుంట, నల్లవల్లి, కొత్తపల్లి ,వీరన్నగూడెం, దోమడుగు గ్రామాల్లో తెలంగాణ జాతిపిత ప్రొ. జయశంకర్ సార్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
సోలక్పల్లి గ్రామంలో
జిన్నారం, ఆగస్టు 6 : ప్రొఫెసర్ జయశంకర్‌సార్ జయంతిని మండలంలో నిర్వహించారు. సోలక్పల్లి గ్రామంలో ఎంపీపీ రవీందర్‌గౌడ్, వైస్ ఎంపీపీ గంగురమేశ్, సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. ఖాజీపల్లిలో సర్పంచ్ చిట్ల సత్యనారాయణ, నల్తూరు గ్రామంలో సర్పం చ్ జనార్దన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్ స్థానిక నాయకులతో కలిసి జయశంకర్‌సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భార్గవ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సదాశివపేట మండలంలో
సదాశివపేట, ఆగస్టు 6: జయశంకర్ సార్ జయంతిని నిర్వహించారు. మండల పరిధిలోని ముబారక్‌పూర్‌లో సర్పంచ్ మన్నె శ్రీవాణి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
అమీన్పూర్,ఆగస్టు 6: ప్రత్యేక తెలంగాణ కోసం జయశంకర్ సార్ కృషిని ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలో జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.