
రామాయంపేట, ఆగస్ట్టు 7: ప్రభుత్వం దళిత బంధు పథకంతో దళిత కాలనీలు, గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్ అన్నారు. శనివారం పట్టణంతో పాటు గొల్పర్తి, కోమటిపల్లి, ఎస్సీ, ఎస్టీ కాలనీలను సందర్శించి కాలనీల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్, ఏఈ భిక్షపతి, కౌన్సిలర్ అనిల్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు చింతల యాదగిరి, మల్యాల కిషన్, సీవో నరేశ్, శ్రీనివాస్, మై సయ్య ఉన్నారు.
రామాయంపేట మండలం కాట్రియాల గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్పంచ్ గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలను సందర్శించి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న నిధులను దళితులు, గిరిజన ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మైలారం శ్యాములు అన్నారు. సర్పంచ్ వెంట కార్యదర్శి రాములు తదితరులున్నారు.
చేగుంట,ఆగస్టు 7:దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభు త్వం వారికి రూ.10 లక్షలను అందజేయడం కోసం చేగుంటలోని దళిత వా డలో అధికారులు సర్వే చేపట్టారని ఈ వో రాణి తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు దళిత వాడలో ఇంటింటికీ తిరుగుతూ వారి స్థితి గతుల వివరాలను నమోదు చేసుకొని ఉన్నత అధికారులకు నివేదికను అందజేయనున్న ట్లు ఈవో తెలిపారు.
నిజాంపేట,ఆగస్టు7: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గ్రామ పంచాయతీ పాలక వర్గం మౌలిక సదుపాయాలపై స ర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనూష మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు దళిత వాడల్లో పర్యటించి సమస్యలు గుర్తించి,వాటిని నివేదికగా తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.కార్యక్రమంలో ఎంపీటీసీ లహరి, ఉపసర్పంచ్ బాబు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కిష్టారెడ్డి , పంచాయతీ కార్మదర్శి అంజయ్య, టీఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనర్సింహులు ఉన్నారు.