
సంగారెడ్డికి చెందిన క్రాంతి కుమార్ హోం డెలివరీ రంగంలో అడుగు పెట్టాడు. ‘అప్నా చోటు’తో అందరికీ దగ్గరయ్యాడు. మొదట ఒక డెలివరీ బాయ్‌తో సేవలను అందుబాటులోకి తెచ్చి, నేడు 30మందికి పైగా యువకులకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఇందులో ఫుడ్‌తో పాటు వందలాది సేవలను ప్రజల చెంతకు చేరుస్తున్నాడు.
కంది, ఆగస్టు 7: ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌దే హవా. కూర్చు న్న చోటు నుంచే ఒక్క క్లిక్‌తో ఇంటికి ఏది కావాలన్నా తె ప్పించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన చాలా మొ బైల్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. మొదట్లో ఇవి అమెరికా వంటి దేశాల్లో మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా డెలవరీ సేవలు పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో మొదటగా కొన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాయి. ఇందులో కొన్ని చిన్న, చిన్న సంస్థలు అంతగా నడవలేదు. ఆ తర్వాత స్విగ్గీ వంటి డెలవరీ సేవలు కొన్నేండ్ల నుంచి సంగారెడ్డిలో కొనసాగుతున్నాయి. అయితే ఎక్క డో ఉన్న వారు ఇక్కడి వచ్చి ఫుడ్ డెలవరీ చేస్తున్నా రు. మరి మనం కూడా ఇక్కడే ఉండి, ఇలాంటి సేవ లు ఎందుకు మన పట్టణ పరిధి ప్రజలకు అందించకూడదనే ఒక్క ఆలోచనే అతడిని మార్చేసింది. అది కూడా తక్కువ ధరకే ఇవ్వాలనే సంకల్పంతో తల్లిదండ్రుల సహకారంతో సంగారెడ్డికి చెందిన క్రాంతి కుమార్ ‘అప్నా చోటు’ అనే ఫుడ్ డెలివరీ సంస్థను స్థాపించాడు. ముందుగా అతడు ఒక కార్యాలయాన్ని తెరిచి, కరపత్రాలు పంచి అందులో తమ సేవలు, ఫోన్ నంబర్లను సంగారెడ్డి పట్టణ ప్రజలకు చేరవేశాడు. కొన్ని నెలల పాటు కార్యాలయంలో ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఆర్డర్లు తీసుకుని, డెలివరీ బాయ్స్‌తో నేరుగా ఇంటికే అందించాడు. తర్వాత యాప్‌ను రూపొందించాడు. అందులో ఫుడ్‌కు సంబంధించిందే కాకుండా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తెచ్చాడు.
సంగారెడ్డి పట్టణం ఓడీఎఫ్ కాలనీకి చెందిన రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి గౌని కిష్టయ్య మూడో కొడుకు క్రాంతి కుమార్. క్రాంతి గతంలో స్థానికంగా ఒక కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసెస్ సెంటర్ నిర్వహిస్తుండగా, అతని ఇద్దరు అన్నలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. కాంత్రి 2019 ఆగస్టు 20న ‘అప్నా చోటు’ పేరుతో ఓ డెలివరీ సంస్థను ప్రారంభించాడు. మొదట ఫోన్‌తోనే ఫుడ్ ఆర్డర్లు తీసుకోగా, క్రమంగా ఆర్డర్లు పెరగడంతో 2019 డిసెంబర్ 25న యాప్‌ను తయారు చేయించాడు. ఇంకేముంది అక్కడి నుంచి ఆ యాప్ ద్వారా అతడి సంస్థకి ఆర్డర్ల సంఖ్య రోజుకు వందల్లో పెరిగిపోయింది. ఒక్క డెలవరీ బాయ్‌తో మొదలైన అతడి ప్రస్తానం. ఇప్పుడు ఆ సంస్థలో మొత్తం 15మంది డెలివరీ బాయ్స్‌తో పాటు ఇద్దరు ఫోన్ ఆపరేటర్లు పని చేస్తున్నారు. ఇందులో పని చేస్తున్న ఒక్కో డెలివరీ బాయ్‌కి నెలకు రూ.15వేలు, ఆఫీస్ ఆపరేటర్ బాయ్స్‌కు రూ.12వేల జీ తం ఇస్తూ సక్సెస్ వైపు అడుగులు వేస్తున్నాడు. కాగా, క్రాంతికి ఈ యాప్ ద్వారా నెలకు అన్నీ పోను సొం తంగా రూ.70వేల దాకా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అప్నా చోటూ యాప్‌లో కేవలం ఫుడ్‌కు సంబంధించినవే కాకుండా హోం, ప్రొఫెషనల్, ఫుడ్, వెడ్డింగ్స్, ఈవెం ట్స్, ట్రావెల్స్, ట్రిప్స్, ఎమర్జెన్సీ సర్వీసులతో అనుసంధానం గా మొత్తం వందకు పైగా సేవలు ఉన్నాయి. ఇంట్లో ఫ్రిజ్, గ్రీజర్, టీవీ ఇలా ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు రిపేర్లు చేయించాలన్నా ఈ యాప్‌లో నంబర్‌కు సంప్రదిస్తే చాలు. వారే అందుకు సంబంధించిన మెకానిక్‌లను నేరుగా మన ఇంటికి పంపుతారు. అలాగే పిల్లలను ఇంటి నుంచి స్కూల్లో దించాలన్నా, మార్కెట్ నుంచి కూరగాయలు, చికెన్, మటన్ ఇలా ఏది కావాలన్నా.. వారు అక్కడికి వెళ్లి మరీ మన కోరిన విధంగా ఇంటికి తెచ్చిఇస్తారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సీసీ కెమెరా ఇన్స్టలేషన్, కారు డ్రైవర్ల సర్వీస్, క్యాబ్‌లు, లిఫ్టు మెకానిక్, ల్యాండ్ సర్వే అందుబాటులో ఉండగా, అన్ని రకాల మెడికల్ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఫుడ్ డెలవరీకి అయితే ఒక్క ఆర్డరుకు రూ.30 చార్జీ చేస్తుండగా, ఇతర సేవలు, దూర ప్రాంతాలకు రూ.50 చొప్పున ఒక్క ఆర్డరు తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఈ యాప్‌లో క్యాష్ ఆన్ డెలవరీ పద్ధతి ద్వారా నడిపిస్తున్నారు. త్వరలో ఆన్లైన్ పేమెంట్‌ను ప్రారంభించబోతున్నట్లు క్రాంతి తెలిపాడు.
నేను స్థాపించిన ఈ ‘అప్నా చోటూ’ యాప్‌లో మొదట కేవలం ఒక్క డెలవరీ బాయ్ మాత్రమే ఉండేవాడు. ఇప్పుడు నా వద్ద 30మంది బాయ్స్, ముగ్గురు ఆఫీస్ ఆపరేటర్లు, నలుగురు టెక్నికల్ టీంలో పని చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం 37మందికి జీతాలు ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నా. వీరితో పాటు మా యాప్‌లో ఇతర సేవలు కూడా పెట్టడంతో మరో 50 మందికి మా ద్వారా రోజూ ఉపాధి కలుగుతున్నది. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా దీనిని విస్తరింపజేయాలన్నదే నా ఏకైక లక్ష్యం. త్వరలోనే జహీరాబాద్, తూప్రాన్, నర్సాపూర్, పటాన్చెరు నుంచి లింగంపల్లి ప్రాంతాలతో పాటు సిద్దిపేట, మెదక్‌లో కూడా ఫ్రాంచైజీ పద్ధతిని కొనసాగించబోతున్నట్లు వివరించారు. ఎవరైనా తమ ఫ్రాంచైజీ కావాలనుకునే వారు 9150915084ను సంప్రదించాలన్నారు.