
నడిగూడెం, ఆగస్టు 6 : మండల సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో అధికారులు అలసత్వం వహించొద్దని హెచ్చరించారు. విద్యుత్ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దేవబత్తిని వెంకట నర్సయ్య, ఎంపీడీఓ ఇమామ్, తాసీల్దార్ ఆనంద్‌బాబు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కాసాని వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సిరెడ్డి పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ప్రారంభం
కోదాడటౌన్ : పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం 5,6వ వార్డుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. అంతకు ముందు అభయాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో కోదాడ డీఎస్పీ రఘు, పట్టణ సీఐ నరసింహారావు, టీఆర్ఎస్ పట్టణ సెక్రటరీ మేకపోతుల సత్యనారాయణ, వనపర్తి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్, కందుల కోటేశ్వర్రావు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్, మాధవి, ఈదుల కృష్ణయ్య, బ్రహ్మం, నరేశ్ పాల్గొన్నారు.
ప్రదీప్ కుటుంబానికి పరామర్శ
మోతె : మండలంలోని రాఘవాపురం ఎక్స్‌రోడ్డు గ్రామంలో టీఆర్ఎస్ లీగల్ సెల్ జిల్లా నాయకుడు పొదిల ప్రదీప్‌కుమార్ కుటుంబాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శించారు. ప్రదీప్‌కుమార్ తండ్రి చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు ఆర్కే నాయక్, దేవుల నాయక్, నగేశ్ ఉన్నారు