రీజినల్ రింగు రోడ్డుకు సంబంధించి తొలి అడుగు పడింది. రింగు రోడ్డు వెళ్లే గ్రామాలను తెలుపుతూ తుది అలైన్మెంట్ మ్యాపును శుక్రవారం ఢిల్లీలో ఎన్హెచ్ఏఐ అధికారులు విడుదల చేశారు. మరో వారం రోజుల్లో సర్వే నంబర్ల ఆధారంగా గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 59 కిలోమీటర్ల మేర రింగు రోడ్డు నిర్మాణం జరుగనుండగా సింహభాగం భూసేకరణను ఈ జిల్లాలోనే చేపట్టనున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, వలిగొండ, తుర్కపల్లి మండలాల్లోని 34 గ్రామాల మీదుగా రింగు రోడ్డు వెళ్లనుండడంతో త్వరలోనే భూసేకరణ జరిపేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి):రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి తొలి గెజిట్ విడుదలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో 15 మండలాలకు సంబంధించిన 113 గ్రా మాల మీదుగా రింగు రోడ్డు నిర్మితం కానుంది. 158.645 కిలోమీటర్ల నిడివితో ఉత్తర భాగంలో నిర్మించే రోడ్డుకే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి గెజిట్ను విడుదల చేసింది. మొత్తం 1,904 హెక్టార్ల భూమి అవసరం పడుతుండగా..అత్యధికంగా 800 ఎకరాలకు పైగా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే సేకరించనున్నారు. ప్రస్తుతం నాలుగు వరసలతోనే రహదారిని నిర్మించనుండగా.. భవిష్యత్తులో వందమీటర్ల వెడల్పుతో 8 వరసలకు విస్తరించేలా భూసేకరణ చేపట్టనున్నారు.
రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి పట్టణం వద్ద ప్రారంభమై చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. ఇందుకు సంబంధించి కొద్దిరోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కాంపిటెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. యాదాద్రి జిల్లాకు చెందిన అదనపు(రెవెన్యూ) కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితోపాటు భువనగిరి, చౌటుప్పల్, గజ్వేల్, సంగారెడ్డి, నర్సాపూర్, జోగిపేట, తూఫ్రాన్ ఆర్డీఓలు ఈ అథారిటీలో ఉంటారు. వీరికి కేటాయించిన గ్రామాలలో భూసేకరణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది.
గంధమల్ల, వీరారెడ్డిపల్లి, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయిపల్లె, వేల్పుపల్లె, మల్లాపూర్, దత్తార్పల్లి
రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచికల్పహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్ నగర్, ఎర్రంబల్లె, నందనం
చిన్నకొండూరు, వర్కట్పల్లి, గోకారం, పొద్దుటూరు, వలిగొండ, సంగెం, చౌటుప్పల్, లిం గోజిగూడెం, పంతంగి, పహిల్వా+న్పూర్, కంచనపల్లి, టేకుల సోమారం, రెడ్లరేపాక, నేలపట్ల, తాళ్ల సింగారం, స్వాములవారి లింగోటం,
వలిగొండ, ఏప్రిల్ 1 : నాగారం గ్రామ పరిధిలో మూసీ నదిపరీవాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.