
ఊట్కూర్, జనవరి 12: రక్తదానం ప్రాణదానంతో సమానమని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో బుధవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..యువకులు గ్రామాలను అభివృద్ధి పథంలోకి తేవాలన్నారు. రక్తదానం చేసిన పలువురు యువకులను అభినందిస్తూ ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, పాలమూరు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ కన్వీనర్ నటరాజ్, లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్, బీజేపీ మండలాధ్యక్షుడు రమేశ్, పీహెచ్సీ వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డి, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అరుణ్, మండల కన్వీనర్ బాలాంజనేయులు పాల్గొన్నారు.
బిజ్వారంలో..
వివేకానంద జయంతి వేడుకలను ఊట్కూర్, బిజ్వారం గ్రామాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో బీజేపీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా గౌరవాధ్యక్షుడు నర్సింగప్ప, శేషప్ప, రఘువీర్, భరత్, కృష్ణయ్య, నరసింహ, మహేశ్‌గౌడ్, అశోక్ పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గి, జనవరి 12: వివేకానందుడు యువతకు ఆదర్శమని పీఏసీసీఎస్ వైస్ చైర్మన్, వేణుగోపాల్, కోఆప్షన్ సభ్యుడు ఓంప్రకాశ్ అన్నారు. వివేకానంద యువజన సంఘం, విశ్వహిందూ పరిషత్ నాయకులతో కలిసి వివేకానందుడి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు
పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో..
మక్తల్ టౌన్, జనవరి 12: మక్తల్ పట్టణంలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం పట్టణంలోని శ్రీపడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకొన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి నివాసంలో వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ అధ్యక్షుడు రమేశ్‌రావు ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజుల ఆశిరెడ్డి, గణేశ్, కొండయ్య, తాయప్ప, రమేశ్, సత్యనారాయణ, నర్సింహులు, రవికుమార్ పాల్గొన్నారు.
వివేకానంద ఆశయాలను కొనసాగిద్దాం
మక్తల్ టౌన్, జనవరి 12: స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగిద్దామని టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోపాలం అన్నారు. బుధవారం స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని జిల్లా టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలం ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని మినీ స్టేడియం నుంచి పురవీధుల గుండా నల్లజానమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు రఘుప్రసన్నభట్, పీఈటీలు రూప, మంజుల, అంబ్రేష్, రేణుక, దామోదర్, తులసీ, పరంజ్యోతి, రామక్రిష్ణ, అరుణ్, సుష్మ, నిరేషా, వంద మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
కానుకుర్తిలో..
దామరగిద్ద, జనవరి 12: మండలంలోని కానుకుర్తి గ్రామంలో స్వామి వివేకానంద జయంతిని సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కొవిడ్ టీకా కేంద్రాన్ని సందర్శించి ఏఎన్ఎం రాజేశ్వరిని సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు కానుకుర్తి ఎంపీటీసీ బస్వరాజ్, రైతుబంధు సమితి జిల్లా నాయకులు వెంకట్‌రెడ్డి, నాయకులు సత్యయాదవ్, యువకులు సురేశ్‌రెడ్డి, మాణిక్ పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్, జనవరి 12 : మండలంలోని కన్మనూర్, మాధ్వార్, అప్పంపల్లి గ్రామాల్లో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి బుధవారం నివాళులర్పించారు. మరికల్లో యువక మండలి అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు.
మద్దూరులో..
మద్దూరు, జనవరి 12: పట్టణంలోని వివేకానందుడి విగ్రహానికి యువజన సంఘం, టీఆర్ఎస్ నాయకులు, యువకులు పూలమాల వేసి ఉత్సవాలు నిర్వహించారు.
ధన్వాడలో ..
ధన్వాడ, జనవరి 12: ధన్వాడలో బుధవారం టీఆర్ఎస్ యువజన విబాగం, ఏవీబీపీ, శ్రీ షిర్డీసాయి యువజన సంఘం, డీసీసీ యువజన విభాగం ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్, సునీల్‌రెడ్డి, సచిన్, చంద్రశేఖర్, వీరేశ్గౌడ్తోపాటు మాజీ వైస్ ఎంపీపీ రాంచంద్రయ్య, సుదర్శన్‌గౌడ్, నర్సింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఘనంగా వివేకానంద జయంతి
నారాయణపేట రూరల్, జనవరి 12: పేట మండలంలోని కోటకొండ గ్రామంలో నవయువత ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రవికుమార్, నవీన్, సాయిలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కులో పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో యూనియన్ నేతలు నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, రఘువీర్, జనార్దన్, సత్యనారాయణరెడ్డి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, ఈసీ మెంబర్లు ఆత్మారాం, చెన్నారెడ్డి, సుభాష్, డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, ఉమాకాంత్, ప్రభుగౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. డీవైఎస్వో కార్యాలయం వద్ద డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది విద్యాసాగర్, శ్రీనివాస్, సాయినాథ్, పీఈటీలు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
యువతకు ఆదర్శం
మక్తల్‌రూరల్, జనవరి 12: స్వామి వివేకానందుడు యువతకు ఆదర్శమని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నర్సింహగౌడ్ కొనియాడారు. బుధవారం మక్తల్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో టూ కే రన్ పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అంతకుముందు స్థానిక నల్లజానమ్మ ఆలయం నుంచి టూ కే రన్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీహరి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు గోపాలం, టీఆర్ఎస్ నాయకుడు తాయప్ప, పీఈటీలు గోపాల్, మంజుల, తులసీ, దామోదర్, పరంజ్యోతి, రేణుక తదితరులు పాల్గొన్నారు.
జక్లేర్‌లో..
మండలంలోని జక్లేర్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు రంజిత్‌కుమార్, ప్రధానకార్యదర్శి రంగనాథ్, కోశాధికారి నర్సింహస్వామి, వనిత క్లబ్ అధ్యక్షురాలు అశ్విని, ప్రధాన కార్యదర్శి మేఘన, ఆర్యవైశ్య సంఘం నాయకులు సురేశ్, భాస్కర్, హరినాగరాజు పాల్గొన్నారు.
కృష్ణలో..
కృష్ణ, జనవరి 12: మండల కేంద్రంలో బుధవారం వివేకానందుడి విగ్రహానికి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయప్పపాటిల్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. గుడేబల్లూర్, ముడుమాల, కృష్ణ ప్రభుత్వ పాఠశాలలో జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శివరాజ్‌పాటిల్, మోనేశ్, మహదేవ్, శంకర్‌నాయక్, కృష్ణ, ఆనందాచారి, సాగర్భట్, వాసుదేవాచారి, నారాయణభట్, గిరిచారి, సూర్యప్రకాశ్, వెంకటేశ్, రామాచారి పాల్గొన్నారు.