జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం భువనగిరి పట్టణంలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. మిగతా మండలాల్లో 43.3 డిగ్రీల నుంచి అత్యల్పంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఎండ వేడిమి, ఉక్కపోతతో జనం బయటికి వెళ్లడానికి భయపడుతున్నారు.
భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 25 : జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భానుడి భగభగతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. భువనగిరిలో సోమవారం అత్యధికంగా 44డిగ్రీలు, అత్యల్పంగా 23.6డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.
భువనగిరిలో అత్యధికంగా 44డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా బీబీనగర్ మండలంలోని వెంకిర్యాలలో 43.3డిగ్రీలు, యాదగిరిగుట్టలో 42.9, బొమ్మలరామారం మండలంలోని మర్యాలలో 42.5, వలిగొండలో 42.5, తుర్కపల్లిలో 42.2, నందనంలో 42.2, మోత్కూరు మండలం బుజిలాపురంలో 42.1, సంస్థాన్నారాయణపూర్లో 41.6, రాజాపేటలో 41.6, పోచంపల్లి మండలం జలాల్పూర్లో 41.2, ఆత్మకూర్లో 41.2డి, కొలనుపాకలో 41.2, వెల్లంకిలో 41.2, చౌటుప్పల్ తూప్రాన్పేటలో 41.1, దత్తప్పగూడెంలో 41.1, వర్కట్పల్లిలో 41.1, చౌటుప్పల్లో 41డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.