ఆలేరు రూరల్, ఏప్రిల్ 15 : సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొలనుపాక, రాఘవాపురంలో రూ.25 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోవడంతో రూ.3,500 కోట్ల నష్టం వచ్చినా ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నారు. కొలనుపాకలో పిన్ చెరువును రూ.6 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చామన్నారు.
రూ.1.50కోట్లతో సీసీ రోడ్లు వేసినట్లు తెలిపారు. ఆలేరు నుంచి కొలనుపాకకు రూ.5.50కోట్లతో డబుల్ రోడ్డు వేసినట్లు చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు బాగు చేశామన్నారు. గోదావరి జలాలతో చెరువులు, కుంటలను నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలోనే 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత కూడా సీఎం కేసీఆర్‌దే అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ , రైతుబంధు, రైతుబీమా, దళితబంధు తదితర పథకాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తుచేశారు. అదేవిధంగా కొలనుపాక నుంచి రాఘవాపురం రోడ్డుకు రూ.64 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. అర్హులందరికీ త్వరలోనే పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 57 ఏండ్లు నిండినవారంతా పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, సర్పంచులు బక్క రాంప్రసాద్, ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, ఉప సర్పంచులు మామిడాల అనిత, పరిదె పద్మ, మార్కెట్ కమిటీ, పీఏసీఎస్ డైరెక్టర్లు మామిడాల నర్సింహులు, ఆరె మల్లేశ్, గవ్వల నర్సింహులు, ఎంపీటీసీ ఆరె ప్రశాంత్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు జంగ స్వామి, కరికె మల్లేశ్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు సర్వర్‌పాషా, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు మామిడాల భానుచందర్, అయిలి కృష్ణ, కొలనుపాక యూత్ అధ్యక్షుడు మడిపల్లి సురేశ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.