
జిల్లాలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు
అందంగా అలంకరించిన బోనాలను ఎత్తుకుని నైవేద్యాలు సమర్పించిన మహిళలు
ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రజాప్రతినిధులు
పల్లెలు బోనమెత్తాయి. అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో.. అంటూ భక్తజనం పారవశ్యంలో మునిగిపోయారు. ఆదివారం జిల్లాలోని రాజాపేట, తుర్కపల్లి, చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్, యాదగిరిగుట్ట, మోటకొండూర్, ఆత్మకూరు(ఎం), ఆలేరు, గుండాల,బొమ్మలరామారం మండలాల్లో అంగరంగ వైభవంగా బోనాల వేడుకను జరుపుకున్నారు. తెల్లవారు జామునుంచే ఆలయాలకు భక్తుల రాక మొదలైంది. ఉదయం భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. మహిళలు బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. చౌటుప్పల్ మండలం తంగడపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, దండుమల్కాపురం శ్రీ ఆందోళ్‌మైసమ్మ దేవాలయంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల జాతర సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల ఆట పాటలు ఆకట్టుకున్నాయి.
-నమస్తే తెలంగాణ బృందం, ఆగస్టు 29
భువనగిరి అర్బన్, ఆగస్టు 29: భువనగిరి పట్టణంలోని హన్మాన్‌వాడ, బహర్పేట్, రాయగిరి గ్రామంతోపాటు పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భం గా మహిళలు ఉదయం నుంచి పోచమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్ల ఆలయాలకు కొవిడ్ నిబంధనల పాటిస్తూ డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య ప్రదర్శనగా వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణం, రాయగిరిలోని పోచమ్మ ఆలయాల్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మండలంలోని మన్నెవారిపంపు, తాజ్పూర్, హన్మాపూర్తోపాటు మండలంలోని పలు గ్రామాల్లోనూ బోనాల జరుపుకొన్నా రు. మండలంలోని బస్వాపురంలో ఎంపీపీ నిర్మలావెంకటస్వామి పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాండు, మంజుల, మన్నెవారిపంపు ఉప సర్పంచ్ భానుచందర్‌రెడ్డి, జహంగీర్, భక్తులు పాల్గొన్నారు.
అమ్మవారిని భక్తితో పూజిస్తే..
చౌటుప్పల్, ఆగస్టు29: ముత్యాలమ్మ అమ్మవారిని భక్తితో పూ జిస్తే సకల శుభాలు కలుగుతాయని మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు అన్నారు. బోనాల పండుగను పురస్కరించుకొని ఆదివా రం తంగడపల్లి గ్రామంలోని ఇందిరపాల ముత్యాలమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాగరాజు, వనజ, వరమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.
బీబీనగర్‌లో భక్తిశ్రద్ధలతో బోనాలు
బీబీనగర్, ఆగస్టు 29: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఆదివారం బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహిళలు డప్పుచప్పుళ్లతో అమ్మవారి ఆలయాలకు ప్రదర్శనగా బోనాలతో వెళ్లి పోచమ్మ, మైసమ్మ అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని పోచమ్మకు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్, బీబీనగర్ జడ్పీటీసీ ప్రణితాపింగళ్‌రెడ్డి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఘనంగా ముత్యాలమ్మకు బోనాలు
ఆత్మకూరు(ఎం), ఆగస్టు29: మండల కేంద్రంలో వారం రోజులపాటు జరుగనున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా గ్రామ దేవతలైన ముత్యాలమ్మ, మైసమ్మలకు ఆదివారం మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న ఏనుగు సుధాకర్రెడ్డిశ్రీలతా దంపతులను సన్మానించారు. బోనాల వేడుకల్లో సర్పంచ్ నగేశ్, ఎంపీటీసీ కవిత, ఉప సర్పంచ్ నవ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దశరథగౌడ్, రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ జహంగీర్‌గౌడ్, ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకన్న, నర్సిరెడ్డి, రాజు పాల్గొన్నారు.
ఎల్లగిరి గ్రామంలో
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు29: ఎల్లగిరిలో బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. డప్పుచప్పుళ్ల మధ్య మహిళలు బోనాలను గ్రామ పురవీధుల గుండా ర్యాలీ తీశారు. బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ముత్యాలమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇందిరాసత్తిరెడ్డి, ఉపసర్పంచ్ బుచ్చిరెడ్డి, గ్రామస్తులు యాదిరెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలీ కులస్తుల బోనాలు
రాజాపేట, ఆగస్టు 29: మండల కేంద్రంలో పద్మశాలీ కులస్తులు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మహిళలు ప్రదర్శనగా బోనాలను తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వలిగొండ మండలంలో..
వలిగొండ, ఆగస్టు 29: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు బోనాలను పసుపు, కుంకుమలతో అలంకరించుకొని డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ లలితాశ్రీనివాస్, సతీశ్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చిత్తాపురంలో నూ తనంగా నిర్మించిన ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని వేదపండితులు ఆదివారం ప్రతిష్ఠించి అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
రామన్నపేట మండలంలో..
రామన్నపేట, ఆగస్టు29: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ముత్యాలమ్మ, మారెమ్మ, మైసమ్మ బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పసు పు, కుంకుమలతో అలకరించిన బోనాలను డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామదేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గుండాల మండలంలో..
గుండాల, ఆగస్టు 29: కొమ్మాయిపల్లి, వెల్మజాల, సీతారాంపురం, మాసాన్‌పల్లి, అనంతారం, సుద్దాల, బ్రాహ్మణపల్లి, రామారం గ్రామాల్లో ఆదివారం ప్రజలు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల సం దర్భంగా పలు గ్రామాల్లో ఎడ్ల బండ్ల ప్రదర్శనను నిర్వహించారు.
మోటకొండూర్ మండలంలో..
మోటకొండూర్, ఆగస్టు 29: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధల తో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను పోచమ్మ, బీరప్ప, కంఠమహేశ్వరుడికి, నల్ల పోచమ్మ ఆలయాల వద్దకు తీసుకెళ్లి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
బొమ్మలరామారం మండలంలో..
బొమ్మలరామారం, ఆగస్టు29: మండల కేంద్రంతోపా టు, నాగినేనిపల్లి గ్రామంలో ప్రజలు బోనాల ఉత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, మహంకాళి, జడల మైసమ్మకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు మహేశ్‌గౌడ్. బీరప్ప, ఉప సర్పం చ్ భరత్, పీఏసీఎస్ చైర్మన్ బాలనర్సయ్య, రాంరెడ్డి, ఈదమ్మ, మధుసూదన్‌రెడ్డి, పాపిరెడ్డి ,రవి, మహేశ్ గౌడ్, ప్రజలు పాల్గొన్నారు.
బోనమెత్తిన గుట్ట
యాదాద్రి, ఆగస్టు29: శ్రావణమాసం సందర్భంగా ఊరు, కుల దేవతలకు సమర్పించే బోనాలు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలోని పోచమ్మ, నల్ల పోచమ్మ, కుల దేవతలైన బీరప్ప, కాటమయ్య దేవతలకు మహిళలు బోనా లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వీరారెడ్డిపల్లిలో..
తుర్కపల్లి,ఆగస్టు29: వీరారెడ్డిపల్లి, గోపాల్పురం గ్రా మాల్లో బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో దుర్గమ్మ, పోచమ్మ, పెద్దమ్మ ఆలయాలకు మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని ప్రదర్శనగా వెళ్లి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.